సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 22నే ఎందుకు..Sye Raa Narasimha Reddy.jpg
2019-09-22 17:05:00

అదేం ప్రశ్న.. వాళ్లిష్టం వాళ్లు పెట్టుకుంటారు.. దానికి కూడా కారణం కావాలా అనుకుంటున్నారా..? అవును పెట్టుకోవచ్చు కానీ కారణం కూడా ఉండాలి కదా అని మరికొందరి అభిప్రాయం. ముందు సెప్టెంబర్ 18 అనుకున్నారు.. వర్షాలు పడ్డాయి వద్దని క్యాన్సిల్ చేసి 22నే ఎంచుకున్నారు. అది కూడా కావాలనే.. ఎందుకంటే సెప్టెంబర్ 22 చిరంజీవికి ప్రత్యేకమైన తేదీ. అదే రోజు ఆయన నటించిన తొలి సినిమా ప్రాణం ఖరీదు 42 ఏళ్ల కింద విడుదలైంది. 1978లో వచ్చిన ఈ చిత్రంతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అందుకే ఇప్పుడు సైరా ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 22న జరగనుంది. దీనికోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుక కోసం అభిమానులు కూడా చాలా రోజులుగా వేచి చూస్తున్నారు.

ఖైదీ నెం 150 తర్వాత ఫ్యాన్స్ ను మెగాస్టార్ మళ్లీ కలిసింది లేదు. అందుకే సైరా కోసం పిచ్చోళ్లలా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఆ సమయం రానే వచ్చేసింది. ఇక ఈ వేడుకలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. అభిమానులు భారీగా వస్తారనే అంచనాలున్నాయి కాబట్టే ఎల్బీ స్టేడియంలో ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. ఇక పాస్ ల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం విఐపి, వివిఐపి, ఎమ్ఐపీ ఉన్న వాళ్లే అక్కడికి రావాలని అభిమానులకు కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ చెబుతున్నారు. మొత్తానికి భారీ భద్రత మధ్య ఈ వేడుక జరగబోతుంది.

More Related Stories