జూన్ 9న వైయస్ జగన్ తో సినీ పెద్దల సమావేశం.. బాలయ్య వస్తాడా..balakrishna
2020-06-06 08:24:32

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ షూటింగ్ అనుమతి కోసం తెలంగాణలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా సినిమా పెద్దలు భేటీ అయ్యారు. ఇందులో కొన్ని కీలకమైన నిర్ణయాలతో పాటు నియమ నిబంధనలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాటికి లోబడి షూటింగ్స్ చేసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సినీ పెద్దలు ప్రభుత్వానికి తెలియజేశారు. ఇక ఇదే క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది సినిమా పెద్దలు వెళ్లి కలవబోతున్నారు. ఈ మేరకు వాళ్లు జూన్ 9న అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు సహా కొందరు దర్శక నిర్మాతలు కూడా వైయస్ జగన్ తో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో చిరంజీవి ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మొన్న బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఈయన ఇండస్ట్రీ మీటింగ్స్ నుంచి పూర్తిగా దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీ ముఖ్యమంత్రితో జరిగే భేటీకి చిరంజీవి ఎంతవరకు వస్తాడు అనేది అనుమానమే. మరోవైపు ఈ మీటింగ్ కు బాలకృష్ణకు ఆహ్వానం అందిందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రితో జరిగిన మీటింగ్ లో తనను పిలవలేదని బాలయ్య చాలా సీరియస్ అయ్యాడు. అక్కడ అందరూ కూర్చొని భూములు పంచుకుంటున్నారు అంటూ సంచలన కామెంట్స్ కూడా చేశాడు. ఇలాంటి తరుణంలో ఏపీ ముఖ్యమంత్రితో జరగబోయే భేటీకి బాలయ్యను సినిమా పెద్దలు ఆహ్వానిస్తారా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్. ఏపీలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించిన కొన్ని విషయాలపై చర్చ జరగడమే కాకుండా.. షూటింగులకు తీసుకోవాల్సిన అనుమతులు గురించి కూడా ఈ భేటీలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. 

More Related Stories