అబ్బాయి ఛాలెంజ్ కి బాబాయ్ ఏమంటాడో NTR
2020-04-22 20:20:48

ప్రతి ఒక్కరిలోనూ ఓ టాలెంట్ ఉంటుంది. అయితే ఆ టాలెంట్ బయటికి రావడానికి ఓ సందర్భం కావాలి. అలాంటి సందర్భాలు ఇప్పుడు కోకొల్లలు.! ప్రపంచమంతా లాక్‌డౌన్‌ నడుస్తున్నందున్న అందరు ఇళ్లలో ఖాళీగా ఉంటున్నారు. దీంతో ఎవరికి నచ్చిన పని వాళ్లు చేసుకుంటున్నారు. కొందరేమో తమ ప్రవృత్తిని బయటపెడుతున్నారు. మరికొందరేమో ఛాలెంజ్‌లు విసిరి సరికొత్త ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో అలాంటి ట్రెండే మొదలైంది. 

టాలీవుడ్ లో ప్రస్తుతం ‘బీ ద రియల్‌ మాన్‌’ ఛాలెంజ్ హడావుడి నడుస్తోంది. ఎన్టీఆర్, చరణ్ లతో పాటు రాజమౌళి కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొనడం అంతే కాక ఎన్టీఆర్ విసిరినా చాలెంజ్ ని చిరంజీవి ఇప్పటికే అంగీకరించడంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. అయితే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో పాటు బాలయ్యకు కూడా ఎన్టీఆర్ ఛాలెంజ్ విసిరారు. మరి బాలయ్య ఛాలెంజ్ ను అంగీకరిస్తారా లేదా అనేదే ఆసక్తికరంగా మారింది.  

ఎందుకంటే ఎన్టీఆర్ కి బాలయ్యకి గొడవలు అనే ప్రచారం ఎప్పటి నుండి ఉండేది. అయితే హరికృష్ణ మరణం తరువాత వారిద్దరూ కలిసినట్టే ఉంది. అయితే ఇప్పటికీ బాలయ్యకి ఫేస్ బుక్ ఉన్నా అది ఆయన అయితే మెయింటైన్ చేయరు. ఇప్పుడు ఈ ఛాలెంజ్ తో అయినా బాలయ్య యాక్టివ్ అవ్వచ్చేమో అని భావిస్తున్నారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ ఛాలెంజ్ కి బాలయ్య రియాక్షన్ ఏమిటో చూడాలి. 
 

More Related Stories