కెజియఫ్ 2 బాహుబలికి ధీటుగా ఉండబోతుందా..KGF 2 Baahubali
2020-03-15 01:46:08

బాహుబలికి ముందు సౌత్ సినిమా అంటే బాలీవుడ్ వాళ్లకు చిన్నచూపు ఉండేది. కానీ రాజమౌళి వచ్చి అందరి అంచనాలు తలకిందులు చేసాడు. ఒక్కసారి రాజమౌళి ఎంటర్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ అలాగే మారిపోతాయి మరి. ఆయనే అనుకుంటే ప్రశాంత్ నీల్ కూడా బాలీవుడ్ కు మన సినిమా సత్తా చూపించాడు. కెజియఫ్ సినిమాతో ఈయన ఇండియన్ సినిమాలో తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ చిత్రం సృష్టించిన సంచలనాలతో ఇప్పుడు రెండో భాగంపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. 

కేజిఎఫ్ 2 సినిమా కోసం ఇప్పుడు ఇండియన్ వైడ్ గా అంతా ఆసక్తిగా చూస్తున్నారు. పైగా తొలి భాగాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ముగించిన తీరు కూడా అలా ఉంది మరి. అందుకే రెండో భాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు అభిమానులు. అక్టోబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా కెజియఫ్ 2 విడుదలవుతుంది. తొలిభాగం అంత పెద్ద విజయం సాధిస్తుందని వాళ్లు కూడా ఊహించలేదు.. కానీ అది అలా జరిగిపోయింది. దాంతో రెండో భాగం కోసం మరింత ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. 

మరీ ముఖ్యంగా నటీనటుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తొలి భాగం అంతా కన్నడ నటులతో నింపేసిన ఈ దర్శకుడు రెండో భాగం కోసం మాత్రం బాలీవుడ్ నటులను ఎక్కువగా తీసుకుంటున్నాడు. హిందీ మార్కెట్ కోసం వాళ్లను కూడా తన సినిమాలోకి తీసుకొస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ఆయనతో పాటు మరికొంత మంది ఉత్తరాది నటులు కూడా కేజిఎఫ్ 2లో భాగమయ్యారు. రవీనా టాండన్ కూడా కేజియఫ్ 2లో కీలక పాత్రలో నటిస్తుంది. ఎవరైతే డెత్ వారెంట్ విడుదల చేస్తారో వాళ్లు ఈ సినిమాలోకి వచ్చేసారు అంటూ అప్పట్లో ట్వీట్ చేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. రావు రమేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే కెజియఫ్ 2 కచ్చితంగా బాహుబలికి ధీటుగా ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. రెండో భాగం మార్కెట్ 300 కోట్లకు పైగానే జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దాంతో కచ్చితంగా బాహుబలి సినిమాను యశ్ మరిపిస్తాడని కన్నడ అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే బాహుబలి 2ను మరిపించడం కష్టమే కానీ తొలి భాగాన్ని మాత్రం కచ్చితంగా కెజియఫ్ 2 అధిగమిస్తుందని లెక్కలు కడుతున్నారు. 

తెలుగులో కూడా ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. తొలి భాగం కేవలం 4 కోట్ల బిజినెస్ చేస్తే.. రెండో భాగం 30 కోట్ల వరకు చేస్తుంది. ఇక్కడ కూడా కెజియఫ్ 2 కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు ఫ్యాన్స్. మొత్తానికి ఇండియన్ వైడ్ గా ఇప్పుడు కెజియఫ్ 2 ఫీవర్ నడుస్తుంది. మరి దీన్ని యశ్ ఎంతవరకు అందుకుంటాడో చూడాలిక. 

More Related Stories