బీజేపీలోకి చిరు...మళ్ళీ మొదలయిన ప్రచారం!Chiranjeevi
2019-08-17 15:52:13

ఏపీలో ఎన్నికల తర్వాత అక్కడి రాజకీయాల్లో అనేక చోటుచేసుకుంటున్నాయి. నేతలు జోరుగా పార్టీల ఫిరాయింపులకి పాల్పడుతున్నారు. తాజాగా మాజీ కేంద్రమంత్రి చిరంజీవి కూడా ఇప్పుడున్న పార్టీ వీడి బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం మొదలయ్యింది.  ప్రజా రాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఆ అనంతరం తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ అనంతరం ఆయన ఆయన కేందమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో చావుదెబ్బ తినడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తమ్ముడు పవన్ కల్యాణ్ జన సేన స్థాపించినప్పటికీ ఆ పార్టీకి కూడా ఆయన దూరంగా ఉండి, కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టారు. అయితే చిరంజీవిని బిజెపిలోకి తీసుకురావాలని ఆ పార్టీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

గతంలోనే ఇలాంటి ప్రచారం జరిగినా ఆయన పార్టీ వీడలేదు, మరో పార్టీలో చేరలేదు. అయినా మళ్ళీ అదే రకం ప్రచారం నిన్నటి నుండి మొదలయ్యింది. బీజేపీ ఆపరేషన్ 'ఆకర్ష్' లో భాగంగా కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన లీడర్లపై ఆ పార్టీ అధిష్ఠానం కన్నేసి, ఆ వ్యూహంలో ఇందులో భాగంగానే చిరంజీవిని తమ పార్టీలోకి లాక్కోవాలని చూస్తోందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో నేతల జంపింగ్ ల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న బీజేపీ నేత రాంమాధవ్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సైరా సినిమా రిలీజ్ కి ఉంది, ఆ సినిమా అక్టోబర్ రెండవ తారీఖున రిలీజ్ కానుంది. సినిమాకి ముందు పార్టీ మారితే ఇబ్బంది అని భావిస్తున్న ఆయన సైరా విడుదల తర్వాత బీజేపీలో ఆయన చేరే అవకాశాలున్నట్టు సమాచారం.

More Related Stories