గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్...ఆయన వస్తాడాPrabhas
2019-09-08 09:51:54

జెర్సీ సినిమా హిట్ కొట్టి మంచి జోరు మీదున్న న్యాచురల్ స్టార్ నాని, గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హత్తుకునే సినిమాలు తీస్తాడనే పేరున్న విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన్న ఈ సినిమా సెప్టెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కార్తికేయ నెగటివ్ రోల్ లో నటించిన ఈ సినిమా మొదట ఆగస్ట్ 30న విడుదల చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఆగష్టు 15న రిలీజ్ కావలసిన సాహో సినిమాను పోస్ట్ పోన్ చేసి ఆగస్ట్ 30న విడుదల చేస్తుండడంతో ఆలోచనలో పడిన గ్యాంగ్ లీడర్ టీమ్ సాహో లాంటి భారీ సినిమాకి పోటీ వెళ్లడం కంటే వాయిదా వేసుకోవడం మంచిదని భావించి సెప్టెంబర్ 13న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యి అదే డేట్ ప్రకటించారు. 

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈనెల 10వ తేదీన విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఈ సినిమా యూనిట్ నిర్వహించనుందని సమాచారం. ఈ విషయాన్ని గ్యాంగ్ లీడర్ సినిమా యూనిట్ నుండి ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ కోసం ఒక స్టార్ హీరో స్పెషల్ గెస్ట్ గా హాజరవుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. గతంలో ప్రభాస్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తాడని ప్రచారం జరిగింది. అయితే సాహో సినిమా రిజల్ట్ ని బట్టి ఆయన వస్తాడా లేదా అనేది తేలాల్సి ఉంది. త్వరలో సెన్సార్ కి వెళ్లనున్న ఈ సినిమా, ఈనెల 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.....!!

More Related Stories