షూటింగ్‌కు అనుమతి సరే.. ఇన్ని నిబంధనలు పాటిస్తారా..tollywood
2020-06-12 14:50:19

కరోనా వైరస్ కారణంగా మూడు నెలలుగా మూతపడిన సినిమా పరిశ్రమకు కాస్త ఉపశమనం లభించింది. ఇప్పట్నుంచి షూటింగ్స్ చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సంతోషంలో మునిగిపోయారు నిర్మాతలు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అసలే కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో షూటింగ్ అంటే మాటలు కాదు.. దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. నియమాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో ఓ సారి చూద్దామా.. తెలంగాణలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన జీవో విడుదల చేసింది. దాంతో పాటు తీసుకోవాల్సిన నియమ నిబంధనలను కూడా విడుదల చేసింది.

1. షూటింగ్ స్పాట్‌లో వైద్యులు తప్పనిసరిగా ఉండాలి..
2. లొకేషన్‌లో ఎవరూ పాన్, గుట్కా లాంటి పదార్థాలు నిషేధం.. ఎవరైనా తీసుకుంటే కఠిన చర్యలు..
3. షూటింగ్ స్పాట్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ రెండు ఉండాలి.. ఒకే దారి ఉపయోగించకూడదు..
4. స్టూడియోల్లో అభిమానులకు, ఇతరులకు అనుమతి ఉండదు..
5. ప్రతీ ఒక్కరికీ మెడికల్ డిక్లరేషన్ తప్పనిసరిగా ఉండాల్సిందే.. అలా లేకపోతే వాళ్లు అనర్హులు..
6. పరిమిత సిబ్బందితో షూటింగులు చేసుకోవాలి.. లేదంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
7. పొరపాటున ఎవరికైనా కరోనా వైరస్ సోకినా.. యూనిట్‌లో ఎవరైనా మరణించినా కూడా ఆ బాధ్యత మొత్తం నిర్మాత తీసుకోవడమే కాకుండా ఆర్థిక సాయం కూడా అందించాలి. ఇవన్నీ పాటించినపుడే షూటింగ్ చేసుకోవాలి.. లేదంటే అంతే. 

More Related Stories