మహేష్ సినిమాపై త్రివిక్రమ్ ఫోకస్mahesh
2021-07-05 20:22:43

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అంటే జనాలకు ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే వీరిద్దరి కాంబోలో ఇదివరకే వచ్చిన 'అతడు' బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత 'ఖాలేజా' సినిమా థియేటర్ లో పెద్దగా ప్రభావం చూపకపోయినా క్రిటిక్స్ తో పాటు, టీవీ ప్రేక్షకుల మన్ననలను పొందింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరు కలిసి పనిచేస్తున్నట్టు ఎన్నోసార్లు రూమర్స్ బయటకు వచ్చాయి , ఎట్టకేలకు 10 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి సెట్ అయింది.

ప్రస్తుతం మహేష్ బాబు 'గీతగోవిందం' ఫ్రేమ్ పరశురామ్ దర్శకత్వంలో 'సర్కార్ వారు పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి అవ్వాలి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది. ఈ సినిమా పూర్తి అవగానే త్రివిక్రమ్ తో కలిసి పని చేస్తాడు. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ తన పూర్తి కథను సిద్ధం చేసుకొని ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులను వెతికే పనిలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో  సినిమా ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

More Related Stories