వరల్డ్ ఫేమస్ లవర్ ప్రివ్యూWorld Famous Lover Preview.jpg
2020-02-14 05:33:07

విజయ్ దేవరకొండ `వరల్డ్  ఫేమస్ లవర్` ప్రేమికుల రోజు కానుకగా రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ మునుపెన్నడూ లేని విధంగా నలుగురు భామలతో రొమాన్స్ చేస్తున్నాడు. ఐశ్వర్య రాజేష్- కేథరిన్ థ్రెసా- రాశీ ఖన్నా- ఇజబెల్లా కథానాయికలుగా నటించిన ఈ సినిమాని క్రాంతి మాధవ్ తెరకెక్కించారు, మరి ఈ మూవీ మీద దేవరకొండ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే టైటిల్‌తోనే సినిమాపై యూత్‌లో మంచి హైప్ తీసుకురాగలిగారు.

ఒక సినిమాలు నలుగురు హీరోయిన్స్ ఏంటి? అసలు విజయ్ ఈ సినిమాలో ఎన్ని పాత్రలు చేశాడు. ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం లాగా నాలుగు పాత్రలు చేశాడా ? అనే క్యూరియాసిటీ చాలా మందిలో ఉంది. ఇక ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం నా కెరియర్‌లో చివరి లవ్ సినిమా అని స్టేట్ మెంట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. విజయ్ క్రేజ్ పుణ్యమా అని వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీరిలీజ్ బిజినెస్ పెద్ద స్థాయిలోనే పూర్తి చేసింది. దాదాపు 30 కోట్ల మేర ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సాగించింది. డియర్ కామ్రేడ్ (35కోట్ల బిజినెస్) తరువాత ఇది విజయ్ కి పెద్ద ప్రీ-రిలీజ్ బిజినెస్ అనే చెప్పాలి.

కేవలం ఆంధ్రకి 10 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఏరియా వారీ బిజినెస్ పరిశీలిస్తే.. నైజాం 9 కోట్లు.. సీడెడ్ 4కోట్లు..(అడ్వాన్స్).. ఆంధ్ర 10 కోట్లు (ఎన్.ఆర్.ఏ) .. ఏపీ- టీఎస్ కలుపుకుని 23 కోట్ల బిజినెస్ చేసింది. రెస్టాఫ్ ఇండియా- 4 కోట్లు.. ఓవర్సీస్ 3.50 కోట్లు బిజినెస్ చేయగా ప్రపంచవ్యాప్తంగా 30.50 కోట్ల మేర బిజినెస్ సాగించింది. సో మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.

More Related Stories