వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ డేట్ లాకయిందిWorld Famous Lover
2020-02-03 17:59:53

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే స్పెషల్ గా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమాకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా, కేథరీన్ ట్రెసా మరియు ఇజాబెల్లె లైట్ లు నలుగురూ హీరోయిన్స్ గా నటించారు. రిలీజ్ కి ఇంకా పదిరోజులే ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను యూనిట్ కన్ఫర్మ్ చేసింది. ఫిబ్రవరి 6 సాయంత్రం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారని ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. గత ఏడాది విజయ్ దేవరకొండ చేసిన డియర్ కామ్రేడ్ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో వరల్డ్ ఫేమస్ లవర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ నేపధ్యంలో ట్రైలర్ రిలీజయ్యాక ప్రమోషన్ మీద గట్టిగా కూర్చోనున్నట్టు తెలుస్తుంది. 

More Related Stories