కీచక బ్యూటీ కిర్రెక్కించే అందాలను చూసారా..?yamini
2020-05-03 02:43:48

కీచక బ్యూటీ ఏంటి అనుకుంటున్నారా..? కీచక సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది యామిని భాస్కర్. ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ కోరుకున్న గుర్తింపు అయితే రాలేదు  ఈ అచ్చ తెలుగమ్మాయికి. కానీ తనకు అవకాశం వచ్చిన ప్రతీసారి తనేంటో నిరూపించుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది యామిని. ఆ మధ్య నాగశౌర్య న‌ర్త‌న‌శాల‌లో బికినీ అందాలతో కూడా కవ్వించింది ఈ తెలుగుమ్మాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చిన్న సినిమాల‌తో కాలం గ‌డిపిన యామిని.. తనదైన రోజు కూడా వేచి చూస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాట‌మరాయుడులో త‌మ్ముళ్ల‌లో ఒక‌రికి జోడీగా న‌టించినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దానికి ముందే రభసలో కూడా ఓ కీలక పాత్రలో నటించింది. కానీ ఈ సినిమాలు ఫ్లాప్ కావడంతో అమ్మడు రిజిష్టర్ కాలేదు. ఇప్పుడు హీరోయిన్ గా అదృష్టం ప‌రీక్షించుకుంటుంది.

పైగా ప్రతీ సినిమాలోనూ ముద్దులతోనే రెచ్చిపోతుంది. ఇన్ని చేసినా కూడా యామిని కోరుకున్న విజయం మాత్రం రావడం లేదు. ఇన్నాళ్లుగా ఇండ‌స్ట్రీ ఉన్నా.. ఈ భామలో ఈ యాంగిల్ చూడ‌లేదే అంటూ నాలుక క‌రుచుకుంటున్నారు. ఇప్పుడు కూడా హాట్ హాట్ సోయగాలతో మతులు చెడగొట్టే పనిలో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. నడుము ఒంపులతో తీపినరకం చూపిస్తుంది యామిని. తాజాగా ఈమె చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంగుచాటు అందాలన్నీ చూపిస్తూ రెచ్చగొడుతుంది యామిని. అది చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. దర్శక నిర్మాతలు కూడా ఒక్కసారి ఈ ఫోటోస్ చూసారంటే కచ్చితంగా యామిని వైపు లుక్కేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలిక.

More Related Stories