కేజీఎఫ్ స్టార్ యష్ భార్య గురించి ఆసక్తికరమైన విషయాలు.. Yash Radhika Pandit
2019-08-26 08:25:31

కేజిఎఫ్ అని ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ వైడ్ స్టార్ అయిపోయాడు యష్. ఇప్పుడు ఈయన గురించి అన్ని ఇండస్ట్రీలలో కూడా చర్చ జరుగుతుంది. ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాడు ఈ కన్నడ హీరో. ఇక ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. అసలు యష్ ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడు.. ఈయన కెరీర్ ఎప్పుడు మొదలైంది అంటూ చాలామంది ఆరా తీస్తున్నారు. యష్ తండ్రి ఒక ఆర్టీసీ డ్రైవర్. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేస్తున్నాడు ఆయన. కొడుకు సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా తండ్రి ఇప్పటికీ బస్ స్టీరింగ్ పట్టుకున్నాడు. మరో వైపు ఆయన భార్య మాత్రం హీరోయిన్. కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన రాధిక పండిట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈయనకు ఒక పాప కూడా ఉంది. ఇద్దరు కలిసి దాదాపు ఐదు సినిమాల్లో నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ కలిగింది. దాంతో కొన్నేళ్ల కింద పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా రాధిక కొన్ని సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు మరో సారి ఈమె గర్భంతో ఉందని తెలుస్తుంది. కేజిఎఫ్ 2 ఇదే ఏడాది విడుదల కానుంది. అది విడుదలయ్యే సమయానికి కచ్చితంగా ఈ కన్నడ హీరో కుటుంబంలో మరో వ్యక్తి జాయిన్ అవుతాడు అని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ సారి జూనియర్ యష్ వస్తాడా.. జూనియర్ రాధిక వస్తుందా అనే విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎవరు వచ్చిన అభిమానులకు మాత్రం పండగ లాంటి న్యూస్. మరోవైపు ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 2 సినిమాను తొలి భాగాన్ని మించే విధంగా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సైన్ చేసాడని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.

More Related Stories