జూనియర్ యష్ ని పరిచయం చేసిన యష్ Yash
2020-05-01 10:33:57

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2. కె.జి.ఎఫ్ ఏమేరకు సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా కన్నడలోనే కాక తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా భారీ విజయాన్ని సాధించింది. కె.జి.ఎఫ్‌ సినిమా జోరుతో కె.జి.ఎఫ్‌- చాప్టర్ 2 కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్ సహా కొన్ని బాషలలో కీలకమైన పాత్రల కోసం స్టార్ నటులను ఈ సినిమాలో నటింప చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ మెయిన్‌ విలన్‌ అధీరా పాత్రలో నటిస్తుండటం అలాగే లేడీ ప్రధానమంత్రిగా రవీనా టాండన్‌ నటిస్తుండడంతో ఈ సినిమా మీద ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. కేజీఎఫ్ చాప్టర్ 2ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 23న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు కూడా. 

ఇక ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా దెబ్బకు యష్ కి అన్ని బాషలలో క్రేజ్ పెరిగింది. అయితే యష్ భార్య గత ఏడాది సెప్టెంబర్ లో పండంటి బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యష్ తన బాబుకి 6 నెలలు రావడంతో బాబు ఫోటో ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. అంతే కాదు బాబు కి హాయ్ చెప్పండి..అలాగే మీ ప్రేమ ఆశీర్వాదం అందించమని కోరాడు. దీనితో ఫాన్స్ తెగ సంబరపడిపోతూ ట్విట్ల మీద ట్విట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే యష్ కి ఒక పాప ఉండగా, ఈయన రెండో వాడు అన్నమాట.

More Related Stories