టాలీవుడ్ లో విషాదం..యుంగ్ డైరెక్టర్ మృతిCar Accident
2020-10-12 11:57:45

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. గాన గాంధర్వుడు ఎస్పీబి మరణాన్ని మర్చిపోకముందే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. స్వామిరారా సినినిమాకు దర్శకుడు సుధీర్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో  తుది శ్వాస విడిచారు. ప్రవీణ్ శర్వానంద్ హీరోగా నటించిన "రణరంగం" సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ప్రవీణ్ టాలెంట్ చూసిన నిర్మాత అల్లు అరవింద్ అతడికి ఆహా ఓటీటీ లో ఓ సినిమా తియ్యడానికి అవకాశం ఇచ్చాడు. అయితే షూటింగ్ ఇప్పటికే చివరివరకు వచ్చింది. షూటింగ్ లో భాగంగా ఓ సీన్ కోసం కారు నడిపిన ప్రవీణ్ తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అక్కడ వారం రోజులపాటు చికిత్స తీసుకుని పరిస్థితి విషమించడంతో మరణించాడు. ప్రవీణ్ ఎన్నో ఆశలతో ఇండస్ర్టీలోకి అడుగుపెట్టి సినిమా తీయాలని పగలు రాత్రి అనక కష్టపడ్డాడు. తన తొలి సినిమా పూర్తి అయ్యేసరికి తన పేరును స్క్రీన్ పై చూసుకోకుండానే మృత్యుఒడికి చేరడంతో ఆయన స్నేహితులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక ప్రవీణ్ మృతిపై హీరో నిఖిల్ సంతాపం ప్రకటించారు. మరోవైపు ఇటీవల మే నెలలో తమిళ సినీ రంగంలో కూడా యువ దర్శకుడు అరుణ్ ప్రశాంత్ ఇలాగే రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. బైక్ పై వెళుతున్న సమయంలో వెనకనుండి లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే అరుణ్ మృతి చెందాడు. ఆయన మృతితో తమిళపరిశ్రమ విశాదంలోకి వెళ్ళిపోయింది.

More Related Stories