పాన్ ఇండియా రేంజ్ లో ఏపీ సీఎం బ‌యోపిక్



YS Jagans Biopic
2021-07-02 13:07:10

ప్రస్తుతం తెలుగులో బయోపిక్ ల జోరు కనిపిస్తోంది. పలువురు రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ తారాల బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. మ‌రో వైపు ప్రస్తుతం సీఎం లుగా ఉన్న పాలకుల బయోపిక్ లను కూడా తెరకెక్కించ‌డం విశేషం. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ బయోపిక్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి వైఎస్ఆర్ బ‌యోపిక్ ను తీసిన‌ యాత్ర సినిమా దర్శకుడు మాహి వీ రాఘవ దర్శకత్వం వహించబోతున్నాడు. 

అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ జగన్ పాత్రలో కనిపించబోతున్నారు. స్కాన్ 1992 అనే వెబ్ సిరీస్ తో ప్రతిక్ గాంధీ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పటికే ప్రతి జగన్ బయోపిక్ గురించి చెప్పగా ప్ర‌తీక్ గాంధీ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కిస్తున్న ఈ  చిత్రానికి ప్ర‌తిక్ గాంధీ క్రేజ్ కూడా ఎంతోగానో ప్ల‌స్ అవుతోంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. 

ఈ సినిమాలో వైఎస్ఆర్ బ్రతికి ఉన్న కాలం నుండి చనిపోయిన తర్వాత జగన్ సీఎంగా ఎలా ఎదిగారు. ఎలా పాలిస్తున్నారు అనేది సినిమాలో చూపించబోతున్నట్టు దర్శకుడు వెల్లడించారు. జగన్ పాత్ర ఎంతో మందికి ఆదర్శంగా ఉండబోతుందని కూడా దర్శకుడు తెలిపారు. ఇక కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.

More Related Stories