సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రోజా, బాలయ్య సెల్ఫీ..nbk
2020-01-23 14:57:50

ఓ వైపు మూడు రాజధానుల బిల్లుతో శాసనమండలి అట్టుడికిపోతోంది. మండలిలో మంటలు రేగుతున్న సమయంలో సింపుల్ గా బాలకృష్ణతో రోజా దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లును శాసన మండలిలో ఓకే చేయించుకోవడానికి  వైసిపి చాలా కష్టాలు పడింది. అయితే  దీన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం నుంచి కూడా చాలా మంది ఎమ్మెల్సీలు వచ్చారు. అందులో బాలకృష్ణ కూడా ఎమ్మెల్యే హోదాలో హాజరయ్యాడు. ఎలాగైనా 3 రాజధానుల బిల్లులను ఆమోదించుకోవాలని వైసీపీ పట్టుబట్టిన సమయంలో  అది కుదరలేదు. చివరికి శాసనమండలి చైర్మన్ ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాడు. అయితే ఇదంతా ఇలా ఉంటే శాసనమండలి గ్యాలరీలో బాలకృష్ణ, రోజా చేసిన సందడి మరో ఎత్తు. సభ వాయిదా పడటంతో గ్యాలరీలోనే చంద్రబాబు, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు వేచి ఉన్నారు. యాదృచ్చికంగా ఒకే గ్యాలరీలో  ఉన్న రోజా బాలకృష్ణ కెమెరాకు చిక్కారు. అక్కడితో ఊరికే ఉండకుండా పక్కనే ఉన్న బాలకృష్ణతో ఒక సెల్ఫీ దిగింది రోజా. ఈ సెల్ఫీలో బాలకృష్ణ చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజకీయంగా దూరంగానే ఉన్న సినిమాల పరంగా మాత్రం ఇప్పటికీ ఇద్దరు మంచి స్నేహితులుగానే ఉన్నారు. గతంలో చాలా సినిమాల్లో కలిసి నటించారు బాలకృష్ణ, రోజా.

More Related Stories