జాంబిరెడ్డి సినిమా రివ్యూ Zombie Reddy
2021-02-05 20:40:01

టాలీవుడ్ లో బలనటుడిగా అలరించిన తేజ సజ్జ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా కంటే ముందు సమంత ఒబేబి సినిమా తో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు "జాంబీ రెడ్డి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా జాంబీ ల నేపథ్యంలో సాగే కథ కావడం విశేషం. ఈ సినిమాకు కల్కి, అ సినిమాలు తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఇక తెలుగులో మొదటిసారిగా వచ్చిన జాంబీ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా.? లేదా.? ఇప్పుడు చూద్దాం.

కథ : సినిమా మొదలు కాకగానే దేశంలో కరోనా విజృంభనతో వచ్చిన లాక్ డౌన్ ప్రకటించిన సన్నివేశం తో మొదలవుతుంది.  కాగా లాక్ డౌన్ ను లెక్క చేయని గేమ్ డిజైనర్ హీరో తేజ అతని గ్యాంగ్ కిరీటి దక్ష నాగార్కార్ తో కలిసి రాయలసీమ లో ఉంటున్న ఆర్జే హేమంత్ ఇంటికి వెళతారు. అయితే ప్రయాణం మధ్యలో ఎదురైన సంఘటన వారి జీవితలనే మార్చేస్తుంది.  గ్యాంగ్ లో నుండి పెళ్లికి వెళ్లిన తరవాత కిరీటి జాంబీగా మారిపోతాడు. ఆ తరవాత ఊర్లో అందరూ జాంబీలుగా మరిపోతారు. కానీ హేమంత్, తేజ, దక్ష, గెటప్ శ్రీను మాత్రం మామూలుగానే ఉంటారు. ఇక ఈ గ్యాంగ్ ఊర్లో వాళ్ళందరిని తిరిగి మాములు మనుషులుగా మార్చిందా లేదంటే గ్యాంగ్ మొత్తం జాంబీలుగా మారిపోయరా అన్నదే కథ.

విశ్లేషణ : సినిమా ఫస్ట్ హాఫ్ లో లాక్ డౌన్ జోకులు నేపథ్యంలోనే హెల్తీ కామెడీతో సాగుతుంది. ఎక్కడా కూడా వల్గర్ కామెడీ వాడకుండా ప్రేక్షకులను దర్శకుడు నవ్వించాడు. ఇక ఫస్ట్ మొదట్లోనే జాంబీలు కనిపించవు. కరోనా పై పాట అంటూ కొంత సమయాన్ని సాగదీసి ఆ తరవాత జాంబీలను పరిచయం చేస్తాడు. ఇంటర్ వెల్ సమయంలో కిక్ ఇచ్చే సన్నివేశం ఉండటంతో తరవాత ఏం జరుగుతుందో అన్న ఆసక్తి ఎక్కువ అవుతుంది. సినిమా ప్రారంభంలో గెటప్ శ్రీను కామెడీ ఫుల్ గా నవ్విస్తోంది. ఆ తరవాత సినిమా మొత్తం ట్విస్టులతో జనాలను సినిమాలో విలీనం ఐపోతారు. అయితే క్లైమాక్స్ లాజిక్ కొంతమందికి నచ్చకపోవచ్చు. తెలుగులో ఇప్పటి వరకు జాంబీ జోనర్ ను ఏ దర్శకుడు చేయలేదు. ఆ ప్రయోగాన్ని ప్రశాంత్ వర్మ చేయడం అంటే అతడి గట్స్ కి మెచ్చుకోవాలిసిందే. అంతే కాకుండా ఎక్కడ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా సినిమాను ప్రశాంత్ వర్మ భాగా ఎక్కించడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాలో తేజ నటన బాగుంది. మిగితా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్సికల్ టీమ్ కూడా సినిమాకు ప్రాణం పోయటంలో ఎక్కడా తగ్గినట్టు కనిపించలేదు. సినిమాలో కొన్ని పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మొత్తానికి జాంబీ రెడ్డి సినిమాను థియేటర్ లో ఎంజాయ్ చేస్తూ చూడచ్చు.

More Related Stories