English   

ప్రేక్షకులకు గుడ్ న్యూస్...ఈటీవీ నుండి ఓటీటీ

 ETV OTT
2021-06-23 15:29:05

ఓటీటీ లు ప్రారంభమై చాలా కాలం అవుతున్నా వాటికి కరోనా తో విధించిన లాక్ డౌన్ కాలంలోనే గుర్తింపు వచ్చింది. కరోనా పుణ్యమా అని ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. థియేటర్లు మూత పడటంతో సినిమాలు సినిమాలు ఓటీటీలో విడుదల కావడం.. అదే విధంగా తక్కువ ధరలకు సినిమా చూసే అవకాశం రావడం తో ప్రేక్షకులు ఓటీటీల వైపు మల్లారు. ఇక ఇది వరకు హిందీ ఇంగ్లీష్ లోనే ఓటీటీ లు కంటెంట్ ను రూపొందించగా ఇప్పుడు తెలుగులోనూ కంటెంట్ ను రూపొందిస్తున్నాయి.  

ప్రస్తుతం తెలుగులో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, స్పార్క్స్ , జి ఫైవ్ ,ఎంఎక్స్ ప్లేయర్ లాంటి ఓటీటీ లు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తెలుగు వారి నుండి మరో ఓటీటీ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈటీవీ యాజమాన్యం నుండి ఈ ఓటీటీ రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈటీవీ వద్ద కొన్ని వందల సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా పాత సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈటీవీనే అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈటీవీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీవీ షోను రూపొందిస్తుంది. అన్ని టీవీ ఛానల్స్ లో ఈటీవీనే టీవీషోలకు చాలా ఫేమస్. మరోవైపు ఈటీవీ కొత్త దర్శకులు, నటీ నటులతో కంటెంట్ ను రూపొందించి రిలీజ్ చేయాలని భావిస్తోందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది.

More Related Stories