English   

బన్నీ నెక్స్ట్ మూవీ ఎక్సక్లూసివ్ క్లూ దొరికింది

Exclusive News: Allu Arjun Next Movie Director Confirmed
2018-08-20 11:41:37

వ‌ర‌స‌గా మూడు నాలుగు విజ‌యాలు వ‌చ్చిన‌పుడు ఇంత కూడా గ్యాప్ తీసుకోలేదు అల్లుఅర్జున్. కానీ ఒక్క ఫ్లాప్ వ‌చ్చేస‌రికి పూర్తిగా డీలా ప‌డిపోయాడు. అస‌లు సినిమాలు చేయ‌డం కాదు.. క‌థ‌లు విన‌డం కూడా మానేసాడు. ఈయ‌న ఏం చేస్తున్నాడో.. ఏం చేయాల‌నుకుంటున్నాడో కూడా క్లారిటీ లేదు. క‌నీసం ఆయ‌న‌కైనా నెక్ట్స్ ఏం చేయాల‌నుకుంటున్నాడో క్లారిటీ ఉందో లేదో క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే నా పేరు సూర్య విడుద‌లై ఇప్ప‌టికే రెండు నెల‌లు దాటేసింది. ఈ మ‌ధ్య‌లో న‌లుగురు ద‌ర్శ‌కుల పేర్లు వినిపించాయి బ‌న్నీ త‌ర్వాత సినిమా కోసం. కొర‌టాల శివ అన్నారు.. కానీ అత‌డు నో అనేసి చిరు సినిమాపై వ‌ర్క్ చేస్తున్నాడు. త్రివిక్ర‌మ్ అనుకుంటే ఇప్ప‌ట్లో ఉండ‌ద‌ని చెప్పేసాడు.. ఇక విక్ర‌మ్ కే కుమార్ సినిమా ఫైన‌ల్ అన్నారు.. క‌థ కూడా విని ఓకే అన్నాడని వార్త‌లొచ్చాయి.

కానీ ఈ సినిమా కూడా ఆగిపోయింద‌ని వార్త‌లొచ్చాయి. అయితే ఇందులో మాత్రం నిజం లేద‌ని.. బ‌న్నీ త‌ర్వాతి సినిమా ఖచ్చితంగా విక్ర‌మ్ తోనే ఉంటుంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. తాజాగా గీతగోవిందం స‌క్సెస్ మీట్ కు విక్ర‌మ్ కే కుమార్ కూడా వ‌చ్చాడు. గీతాఆర్ట్స్ లో తెర‌కెక్కిన సినిమా కావ‌డం తో విక్ర‌మ్ కూడా వ‌చ్చాడు. అంటే ఈయ‌న త‌ర్వాతి సినిమా కూడా గీతాఆర్ట్స్ లో బ‌న్నీతో ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. అందుకే ఆయ‌న వ‌చ్చాడు. కానీ బ‌న్నీ మాత్రం అంద‌రికీ సై అంటున్నాడు కానీ ఏ ఒక్క‌రికీ క్లారిటీ ఇవ్వ‌లేక‌పోతున్నాడు. ఈ క‌న్ఫ్యూజ‌న్ లో తాను కూడా క్లారిటీలో లేన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌రి ఈ అల్లు వార‌బ్బాయి ఒక్క ఫ్లాప్ కే ఇలా అయిపోతే పాపం సాయిధ‌రంతేజ్ లా ఆరు ఫ్లాపులు వ‌స్తే ఏకంగా సినిమాలే మానేస్తాడేమో..?

More Related Stories