English   

ఎఫ్ 2 రివ్యూ: 

F2-Review
2019-01-12 06:13:32

ఎందుకో తెలియదు గానీ ముందు నుంచి సంక్రాంతి సినిమాల్లో ఎఫ్ టు సినిమా మీదే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఇది ఎలా ఉందో చూద్దాం.

కథ:

వెంకీ (వెంకటేష్) ఒక ఎమ్మెల్యే దగ్గర పీఏ గా పనిచేస్తుంటాడు. త్వరగా పెళ్లి చేసుకొని అందమైన జీవితాన్ని గడపాలని అనుకుంటుంటాడు. అలాంటి వెంకటేష్ కి తమన్నాతో నిశ్చితార్థం జరుగుతుంది. అయితే తమన్నా కుటుంబం మొత్తం భర్తను చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూసే బ్యాచ్. అలాంటి కుటుంబం లోకి వెంకీ అల్లుడుగా వెళ్తాడు. దాంతో పెళ్లికి ముందు సంతోషంగా ఉన్న వెంకటేష్ పెళ్లి తర్వాత కష్టాలపాలు అవుతాడు. తమన్నా చెల్లిని వరుణ్ తేజ్ ప్రేమిస్తుంటాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ వెంకటేష్ కష్టాలు చూసి వెనక్కి తగ్గుతారు. వెంకీ, వరుణ్ లు ఇద్దరూ కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి యూరప్లో చేరతారు అక్కడ ఏమైంది అనేది అసలు కథ.

కథనం:

పెళ్లి కాన్సెప్ట్ చుట్టూ తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. సందడే సందడి, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, పెళ్ళాం ఊరెళితే ఇలాంటి సినిమాలు భార్యాభర్తల మధ్య ఉండే ఫన్, గొడవలు గురించి చాటి చెప్పాయి. ఇప్పుడు ఈ సినిమాను కూడా ఇదే కాన్సెప్ట్ తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. దానికి స్క్రీన్ ప్లే రాసుకుని మ్యాజిక్ చేశాడు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు నవ్వించడం మాత్రమే లక్ష్యంగా ముందుకు వెళ్లాడు ఈ దర్శకుడు. దానికి తగ్గట్లే కథ పక్కన పెట్టి పూర్తిగా సన్నివేశాలపై దృష్టి పెట్టాడు. రోజు మనం జీవితంలో చూసే సంఘటనలు సంభాషణలుగా చేసి రాసుకున్నాడు అనిల్ రావిపూడి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే చాలా సీన్లు అయిన వాళ్లకు ఇలా ఇట్టే కనెక్ట్ అయిపోతాయి. ఒక సీన్ అయిపోయింది అనుకునే లోపు మరో సీన్ వచ్చి కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఈ సినిమాకు ఇదే ప్రధాన ఆయుధం. 
కామెడీతో చంపేశారు 

అనిల్ రావిపూడి ముఖ్యంగా వెంకటేష్ చుట్టూనే కామెడీ సీన్స్ చాలా అల్లుకున్నాడు. భార్యల తో వచ్చే సమస్యలను చాలా ఫన్నీగా చూపించాడు అనిల్ రావిపూడి. వరుణ్ తేజ్ కూడా తెలంగాణా స్లాంగ్ లో అదరగొట్టాడు. మేహరీన్ తో కామెడీ చేయించడం అయితే సినిమాకే హైలైట్. ఇక సెకండ్ హాఫ్ కథ యూరోప్ కు షిఫ్ట్ అయిన తర్వాత కాస్త వేగం తగ్గింది, కానీ కామెడీ తగ్గకుండా చూసుకున్నాడు అనిల్ రావిపూడి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ని తీసుకొచ్చి ఆయనతో కూడా కామెడీ చేయించాడు. ఏదైనా కూడా కామెడీ చేయడం కామన్ అన్నట్లు ముందుకు వెళ్ళాడు అనిల్ రావిపూడి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కుక్క సీన్ అయితే కుర్చీలోంచి కింద పడి నవ్వుకునేలా రాసుకున్నాడు అనిల్ రావిపూడి. సినిమాలో అలాంటి సీన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి మొత్తంగా సంక్రాంతికి వచ్చిన పర్ఫెక్ట్ పొంగల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు అనిల్ రావిపూడి

నటీనటులు పని తీరు :

వెంకటేష్ అద్భుతంగా నటించాడు చాలా ఏళ్ల తర్వాత ఆయన లోని పాత వెంకీని మళ్ళీ చూడచ్చు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ సమయంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలా ఉన్నాడు వెంకటేష్. ఆయన చేసిన కామెడీ కి కళ్ళలో నీళ్ళు వచ్చాయి, అంతగా నవ్వించాడు. ఇక వరుణ్ తేజ్ కూడా అదే స్థాయిలో కామెడీ చేయడం హైలైట్. తెలంగాణా స్లాంగ్ లో అదరగొట్టాడు మెగా వారసుడు. తమన్నా, మెహరీన్ క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి టిపికల్ భార్యలుగా అలరించారు ప్రియదర్శి, రాజేంద్రప్రసాద్ ప్రకాష్ రాజ్ కూడా వాళ్ళ వాళ్లకు పాత్రల పరిధి మేరకు నటించారు

టెక్నికల్ టీం:

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది, పాటలు కూడా బాగానే ఇచ్చాడు ఈ సంగీత దర్శకుడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కుదిరింది. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ సెకండాఫ్ లో అక్కడక్కడ గాడి తప్పినట్లు అనిపించింది. దర్శకుడిగా అనిల్ రావిపూడి నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు. మరో సారి పూర్తి కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు ఈ దర్శకుడు. కాకపోతే కాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది, ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం.

చివరగా: ఫన్ అండ్ ఫ్రస్టేషన్ గో అండ్ ఎంజాయ్.

రేటింగ్: 3.25/5

More Related Stories