English   

ఎఫ్ 2.. సంక్రాంతికి పోరు క‌న్ఫ‌ర్మా..? 

F2
2018-07-14 15:13:37

ఈ రోజుల్లో ఒక్క హిట్ కొట్ట‌డ‌మే గ‌గ‌నంగా మారిపోయింది. అలాంటిది వ‌ర‌స‌గా మూడు విజ‌యాలు అందుకున్నాడు అనిల్ రావిపూడి. అది కూడా ప‌క్కా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లతో. ఒక్కో సినిమాలో ఒక్కో క‌థ‌.. కానీ అన్నింట్లోనూ ఎంట‌ర్ టైన్మెంట్ కామ‌న్. ప‌టాస్.. సుప్రీమ్.. రాజా ది గ్రేట్.. ఈ మూడు సినిమాలు చాలు.. అనిల్ రావిపూడి ఏంటో చెప్ప‌డానికి. ర‌చ‌యిత‌గా ఉన్న‌పుడు విజ‌యం రాలేదు కానీ ద‌ర్శ‌కుడిగా మారాక ప‌రాజ‌యం భ‌య‌ప‌డుతుంది మ‌నోడిని చేర‌డానికి. రాజా ది గ్రేట్ త‌ర్వాత అనిల్ రేంజ్ పెరిగిపోయింది. మ‌నోడు ఓకే అనాలే కానీ స్టార్స్ కూడా సై అంటున్నారు ఈ ద‌ర్శ‌కుడితో ప‌ని చేయ‌డానికి. అయితే ఒకేసారి స్టార్స్ ను ప‌ట్టేసి స్టార్ డైరెక్ట‌ర్ అయిపోవాల‌నే ఆలోచ‌న ఈ కుర్రాడికి లేన‌ట్లుంది. అందుకే ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ఇప్పుడు ఈయ‌న ఎఫ్ 2 సినిమాతో వ‌స్తున్నాడు. 

అంటే ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ అన్న‌మాట‌. ఇందులో వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రెగ్యుల‌ర్ షూటింగ్ వేగంగా జ‌రుగుతంది. అనిల్ రావిపూడి గ‌తంలో వెంకీ హీరోగా న‌టించిన మ‌సాలా సినిమాకు మాట‌లు రాసాడు. అందులో వెంక‌టేశ్ ప‌లికిన బ‌ట్ల‌ర్ ఇంగ్లీష్ డైలాగులు బాగానే పేలాయి. ఆ ప‌రిచ‌యం ప్ల‌స్ ఇప్పుడు అనిల్ ట్రాక్ రికార్డ్ చూసి అత‌డికి వెంకీ ఓకే చెప్పాడు. ఇక వ‌రుణ్ తేజ్ కు దిల్ రాజు గాడ్ ఫాద‌ర్. ఆయ‌న రెండు విజ‌యాలు ఈ కంపౌండ్ నుంచి వ‌చ్చిన‌వే. ఇక ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో వెంకీకి జోడీగా త‌మ‌న్నా.. వ‌రుణ్ కు జోడీగా మెహ్రీన్ న‌టిస్తున్నారు. సంక్రాంతికి సినిమా విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. అయితే అప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ రానుంది. దాంతోపాటు మ‌రో రెండు సినిమాలు కూడా రావాల‌ని ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఎఫ్ 2 సంక్రాంతి పోరు స‌రైందేనా కాదా అని ఆలోచిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. 

More Related Stories