English   

F3లో ముగ్గురు హీరోలు...రచ్చ రచ్చే !

ravi teja acts in f2 movie sequel
2019-01-24 21:13:32

సంక్రాంతి అల్లుళ్లు అంటూ మగవాళ్లాందరి బయోపిక్ అని చెబుతూ F2 చిత్రంతో సంక్రాంతికి మన ముందుకు వచ్చిన వెంకటేష్, వరుణ్ తేజ్‌లు థియేటర్స్‌లో ప్రేకశాకులకి నవ్వులు జల్లులు కురిపిస్తూ నిర్మాతకి మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నారు. పోటీలో వినయ విధేయ రామ, కథానాయకుడు, పేటా లాంటి పెద్ద సినిమాలు ఉన్నా వాటన్నింటినీ తోసిరాజని ఈ సినిమా హిట్‌ గా నిలిచింది. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ లు ఇచ్చిన అనిల్ రావిపూడి F2 చిత్రం ద్వారా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే సూపర్ హిట్ అయి సీక్వెల్ అవకాసం ఉన్న సినిమాలకి సీక్వెల్ తీయడం ఆనవాయితీ కదా అందుకే. F2 సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకి కొనసాగింపుగా F3 చిత్రాన్ని సీక్వెల్ తీయబోతున్నట్టు ప్రకటించారు అనిల్. అయితే F2 అంటే ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి F3లో మరో హీరోని యాడ్ చేయబోతున్నారట. ఆయన ఎవరో కాదు రాజా ది గ్రేట్ చిత్రంతో రవితేజకు సూపర్ హిట్ ఇచ్చిన అనిల్ F3 లో రవితేజని వెంకీ వరుణ్ ల జోడీకి యాడ్ చేస్తున్నారు. అయితే మరో ఆసక్తికర అంశం ఏంటంటే F3 సినిమా కేవలం F2 సినిమా సీక్వెల్‌గా మాత్రమే కాకుండా రవితేజ ‘రాజా ది గ్రేట్’ మూవీకి కూడా సీక్వెల్ గా రెడీ చేస్తున్నారట. రాజా ది గ్రేట్ కథ ప్రకారం రవితేజ అంధుడు కావడంతో F3 లోనూ అంధుడిగా కనిపించబోతున్నారట. మొత్తానికి ‘F3’ చిత్రం అటు ‘F2’కి ఇటు రాజా ది గ్రేట్ చిత్రాల పులగం అన్నమాట. అయితే ఇది అనిల్ ఒక ఇంటర్వ్యూలో ప్రకటించినా కధ రెడీ చేసి ముగ్గురు డెట్లు చూసుకుని మొదలు పెట్టేసరికి ఇంకో ఏడాది అయినా పడుతుందేమో. ఇద్దరు నవ్విస్తేనే థియటర్ లో నవ్వలేక పొట్టలు పట్టుకున్నారు ఆడియన్స్ ఇక ముగ్గురు నవ్విస్తే ఏమైపోతరో ?

More Related Stories