English   

F3.. ముగ్గురు స్టార్ హీరోలతో..

f3
2020-01-22 19:56:44

గతేడాది దిల్ రాజు నిర్మాతగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన F2 చిత్రం బాక్సాఫీసు వద్ద ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ను బాగానే పండించింది. దాంతో ఈ మల్టీ స్టారర్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. ప్రస్తుతం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అనిల్ రావిపూడి.. త్వరలోనే ఈ సీక్వెల్ కు స్క్రిప్ట్ రెడీ చేయడానికి సిద్దమవుతున్నాడట. అయితే ఈ సారి F3లో మరో స్టార్ హీరో కూడా జాయిన్ అవుతుండం విశేషం.

F2ను ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కించిన అనిల్ రావిపూడి.. ఈ సారి F3ని ముగ్గురు స్టార్ హీరోలతో ప్లాన్ చేస్తున్నాడట. అందులోభాగంగా.. వరుణ్, వెంకీలతో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో జాయిన్ అవనున్నాడని వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. వరుణ్, వెంకీ, రవితేజ ఈ ముగ్గురు కలిసి చేసే ఫన్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రవితేజ ఈ నెల 24న డిస్కోరాజాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' మూవీలో నటిస్తున్నాడు రవితేజ.

అలాగే వెంకటేష్.. తమిళ్ హిట్ మూవీ అసురన్ రీమేక్ గా తెరకెక్కుతున్న 'నారప్ప'లో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఓ మూవీలో నటిస్తున్నాడు. ఇలా ఈ ముగ్గురు ప్రస్తుతం ఎవరి ప్రాజెక్ట్ లతో వారు బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత F3లో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. అయితే.. మాస్ మహారాజా ఇందులో నిజంగా నటిస్తున్నాడా లేదా అనేది.. అఫిషీయల్ అనౌన్స్ తర్వాతే తెలియాలి. అన్నట్టు.. F2లో వరుణ్ కు జోడీగా మెహరిన్ నటించగా.. వెంకీకి జోడిగా తమన్నా నటించింది. మరిF3లో వీళ్లే కంటిన్యూ అవుతరా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే. అలాగే రవితేజ సరసన ఎవరిని తీసుకుంటారో చూడాలి.

More Related Stories