English   

కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా

 F3 Shoot
2021-04-16 15:17:22

విక్టరీ వెంకటేష్ దృశ్యం సినిమా షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. ఆ తరవాత మరుసటి రోజే వెంకటేష్ ఎఫ్ 3  సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్ర బృందం సినిమా షూటింగ్ షెడ్యూల్ ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా విజృంభన నేపథ్యంలో చిత్ర యూనిట్ రిస్క్ తీసుకోకూడదని భావిస్తోంది. 

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపుఈ చిత్రాన్ని ఆగస్ట్ 27 న రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కు ఇంకా సమయం ఉండటం తో రిస్క్ లేకుండా షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఎఫ్ 2 నటీనటులతో పాటు కొత్తగా సునీల్ జాయిన్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సినిమాలో అంజలి కూడా ఓ పాత్ర చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ చిత్రంలో వెంకటేష్ రేచీకటి తో బాధపడుతున్న భర్తలా కనిపించబోతున్నాడట.

More Related Stories