English   

భారీ ప్రమాదం నుంచి బయటప‌డ్డ బన్నీ విల‌న్

Fahadh Faasil
2021-06-18 12:17:51

న‌టుడు ఫహద్ ఫాజిల్ ఇప్పటివరకు పాన్ ఇండియా చిత్రాల్లో నటించకపోయినా పాన్ ఇండియా హీరోలకంటే ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పవచ్చు. దానికి గల కారణం అతను ఎంచుకునే కథలే... తను చేసే పాత్రలే అని చెప్పాలి. కమర్షియల్ సినిమాల కంటే ఫ‌హ‌ద్  మనసుకు హత్తుకు పోయే పాత్ర‌ల్లోనే ఎక్కువ‌గా న‌టించి ఆక‌ట్టుకున్నారు. అందువల్లనే ఫ‌హ‌ద్ తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉండ‌గా ఫ‌హ‌ద్ ఇటీవ‌ల ఓ భారీ ప్ర‌మాదం నుండి బతికి బయట పడ్డాడట‌. 

ఆ విష‌యాన్ని ఇటీవ‌ల సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. 'మలయాన్ కుంజు'  సినిమా చిత్రీకరణ సమయంలో చాలా ఎత్తు నుంచి కింద పడి పోయిన‌ట్టు ఫ‌హ‌ద్ తెలిపారు. ఆ సమయంలో తల నేరుగా నేలకు తగలకుండా తన రెండు చేతులు అడ్డు పెట్టుకున్నాన‌ని అలా చేయనట్లయితే త‌న‌ తల పగిలి పోయేది అని తెలిపాడు. 

సాధారణంగా అంత ఎత్తు నుంచి కిందపడి పోయేటప్పుడు చేతులు అడ్డం పెట్టడం అసాధారణం అని వైద్యులు తెలిపారు. కానీ నా అదృష్టం వల్ల అలా జరిగిందని..లేదంటే పెద్ద ప్రమాదం జరిగేదన్నాడు. ఈ ప్రమాదంలో లో త‌న‌ ముక్కుకు గాయం కావడం వల్ల మూడు కుట్లు పడ్డాయని ఆ గాయం తగ్గడానికి కొంత సమయం పడుతుందని తెలిపాడు. ప్రస్తుతం తాను నటించిన  'మాలిక్'  సినిమా 'ఓటిటి' లో విడుదల కావడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఫహద్ పాజిల్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న పుష్ప సినిమాలో న‌టిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. 

More Related Stories