English   

31న రిలీజ్ కానున్న ఫలక్ నుమా దాస్ 

  Falaknuma Das
2019-05-21 12:17:11

మలయాళంలో సూపర్ హిట్ అయిన అంగామలై డైరీస్ సినిమాని తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే, ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ రీమేక్ పేరు ఫ‌ల‌క్‌నుమా దాస్‌. వాజ్ఞ్మ‌యి క్రియేష‌న్స్ క‌రాటే రాజు స‌మ‌ర్ప‌ణ‌లో విశ్వ‌క్ సేన్ సినిమాస్‌, టెర్ర‌నోవా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని కరాటే రాజు, చ‌ర్ల‌ప‌ల్లి సందీప్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను మే 31న విడుద‌ల చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ టీజర్స్ ఈ సినిమా మీద అంచనాలను పెంచగా ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాను 100 మంది దాకా చూశారట, చూసిన వాళ్లంతా సినిమా బాగుందని ప్రశంసలు కురిపించారట దీంతో ఈ సినిమా అందరికీ నచ్చుతుందని మేకర్స్ భావిస్తున్నారు. నిజానికి  రెండు నెలల కిందటి వరకు ఈ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి కూడా జనాలకు తెలియదు. కానీ చడీచప్పుడు లేకుండా సినిమా మొదలుపెట్టి టీజర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఆ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీమేక్ అయినప్పటికీ హైదరాబాద్ పాతబస్తీ నేటివిటీతో ఈ సినిమాకు ఒక కొత్త లుక్ తీసుకురాగలిగారని అంటున్నారు. ఇక ఈ సినిమాని కూడా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థే నిర్మించనుండడంతో ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు.

More Related Stories