English   

ఫలక్ నుమా దాస్ మూవీ రివ్యూ 

Faluknama Das
2019-05-31 11:46:01

వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్‌ సేన్‌ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా ఫలక్ నుమా దాస్. మలయాళ సినిమా అనగామలై డైరీస్ సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా నిన్న రాత్రి ప్రత్యేకంగా ప్రీమియర్ షో వేయడం జరిగింది. దీంతో వీక్షకుల కోసం ఇంత ముందుగా రివ్యూ ఇవ్వడం జరుగుతోంది. టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచుకున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనా అందుకుందో లేదో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కధ :

ఫలక్ నుమా ఏరియాలో పుట్టి పెరిగిన దాస్ (విశ్వక్‌ సేన్‌) అదే ఏరియాలోని శంకరన్న అనే రౌడీ షీటర్ ని చూసి అతన్నే రోల్ మోడల్ గా తీసుకుని చిన్నప్పడే అతనిలా ఒక చిన్నపాటి గ్యాంగ్ తయారుచేసుకుని చిన్న చిన్న గొడవలతో పెరిగి పెద్దవాడు అవుతాడు. సడెన్ గా శంకరన్నని ఎవరో చంపేస్తారు. దాంతో దాస్ ఆ చంపిన వాళ్లను పట్టుకుని పొలీస్ లకు పట్టిస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల వలన శంకరన్నని చంపిన వాళ్ళతోనే దాస్ వ్యాపారం చేయాల్సి వస్తుంది. అలా చేస్తున్న సమయంలో  ఓ బార్‌లో జ‌రిగిన గొడ‌వ‌లో దాస్ స్నేహితుల‌ కోసం ఒకరిని కొడతాడు. ఆ గొడ‌వ క్ర‌మంగా పెద్ద‌దైపోయి ఒక మర్డర్ దాకా వెళ్తుంది. అది కేస్ కాకుండా చేయడానికి ప్రయత్నిస్తారు దాస్ అండ్ గ్యాంగ్, అయితే చివ‌ర‌కు దాస్ ఆ హ‌త్య కేసు నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

ఫలక్ నుమా దాస్ రీమేక్ మూవీ అయినప్పటికీ, అసలు ఎక్కడా రీమేక్ మూవీ అనే భావనే కలగకుండా.. మన నేటివిటీకి తగ్గట్టుగా సినిమాలో చేసిన మార్పులు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నేపధ్యాన్ని హైదరాబాద్ పాతబస్తీ పరిసరాలకు మార్చడం సినిమాకి మైనస్. ఎందుకంటే ఈ పాత బస్తీకి ఓన్ చేసే క్రమంలో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అవుతుందా? అని ఆలోచించలేదు లేదు అనుకుంటా యూనిట్. కేవలం హైదరాబద్ అందులోనూ పాత బస్తీ అనే ఏరియా ఒక్కదాన్ని బేస్ చేసుకుని ఇంత సినిమా ప్లాన్ చేయడం సినిమాకి ఇబ్బందే. ఇక సినిమాని రస్టిక్ లుక్ లో చూపించే ప్రయత్నంలో సినిమా ఒరిజినాలిటీ మిస్ అయింది. నిజానికి తమిళ, మళయాళ ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు ఒప్పుకుంటారు ఏమో కానీ మన తెలుగు వాళ్ళు అంత సాహసం చేయరేమో ? ఇక టేకింగ్, నటీనటుల నటన ప్రధానంగా తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ నటన సినిమాకి హైలెట్. ఇక హీరోయిన్స్ గా నటించిన హర్షిత గౌర్, సలోని, ప్రశాంతిలు  గ్లామర్ తోనే కాక నటన పరంగా కూడా బాగా చేశారు. క్లైమాక్స్ కూడా చప్పగా ఉండడం సినిమాకి మైనస్ అవ్వచ్చు,  కథను మొదలు పెట్టడం, కధనం పరంగా చాలా నెమ్మదించడం సినిమాకి మైనస్ అనే చెప్పాలి, పాత్రలు పరిచయానికే చాలా టైం తినేసింది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన నేపధ్య సంగీతం, సహా మ్యూజిక్ కూడా సోసో గానే ఉంది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఉండి, కొన్ని సార్లు ఇబ్బంది పెట్టింది. ఇక ఈరోజు నాలుగు సినిమాలు రిలీజ్ ఉండడంతో ఈ సినిమా మీద ఆశలు లేనట్టే. ఆ మిగతా మూడు సినిమాల ఫలితాల మీద ఈ సినిమా ఫలితం ఉండనుంది.

ఫైనల్ గా : థియేటర్లకి వచ్చే ప్రేక్షకులకి ఇచ్చి పడేస్తారు.

రేటింగ్ : 2 / 5

More Related Stories