English   

ప్రముఖ జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..

Vangapandu Prasada Rao.jpg
2020-08-04 08:44:45

ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రముఖ కళాకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూసారు. ఈయన వయసు 77 ఏళ్ళు సంవత్సరాలు. కొన్ని రోజులుగా ఈయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆగస్ట్ 4 తెల్లవారుజామున ఈయన మరణించారు. పార్వతీపురం దగ్గర పెదబొండపల్లిలో 1943 జూన్‌లో జగన్నాధం, చినతల్లి దంపతులకు వంగపండు జన్మించారు.

జానపద కళాకారుడిగా మూడు దశాబ్ధాల ప్రయాణం ఈయన సొంతం. 300 పాటలను పాడారు.. ఈయన రాసిన కొన్ని పాటలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. 2008, నవంబరు 23న తెనాలిలో బి.నరసింగరావు చేతుల మీదుగా ఈయనకు బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ అవార్డును ప్రధానం చేశారు. ప్రజల కోసం బ్రతికిన నాజర్ లాంటి కళాకారుడని వంగపండును పోలుస్తారు. మరో జానపద కళాకారుడు గద్దర్‌తో కలిసి 1972లో పీపుల్స్ వార్ సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించాడు. వంగపండు మూడు దశాబ్దాలలో 300కు పైగా పాటలు రాసాడు.

అందులో 12 పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు తమిళం, బెంగాళీ, కన్నడ, హిందీ వంటి పది భారతీయ భాషలలోకి కూడా అనువదించారు కూడా. "యంత్రమెట్టా నడుస్తు ఉందంటే..." అనే పాట ఒక ఆచార్యునిచే ఇంగ్లీష్‌లో కూడా డబ్ చేసారు. అమెరికా, ఇంగ్లాండ్‌లో కూడా ఈ పాట సూపర్ హిట్ అయింది. విప్లవ కవిత్వంలో వంగపండు పాట ప్రముఖ పాత్ర వహించింది. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండు ప్రసాదరావు, గద్దర్ మొదలైనవారు విప్లవ భావాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళారు.

ఏం పిల్లో ఎల్లదమొస్తవా అనే పాట ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయింది. ఇదే పాటను కొన్ని సినిమాల్లో కూడా వాడుకున్నారు. మగధీర సమయంలో వివాదం కూడా అయింది. వంగపండు కన్నుమూత సినిమా ఇండస్ట్రీతో పాటు జానపద కళా లోకానికి కూడా తీరనిలోటు అంటూ అభిమానులతో పాటు సన్నిహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More Related Stories