English   

ఎన్టీఆర్ ట్రాఫిక్ చలాన్ చెల్లించిన అభిమాని.. ఫలితంగా ఏం అడిగాడో తెలుసా..

 NTRs Traffic Challan
2021-01-23 12:36:52

వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. జూనియర్ ఎన్టీఆర్ కు ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్ ఒక అభిమాని చెల్లించాడు. అయినా తమకు ఇష్టమైన హీరోల మీద అభిమానం ఒక్కొక్కరు ఒక్క కూడా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక అభిమాని కూడా ఇదే చేశాడు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులకు సెలబ్రిటీలు, కామన్ పీపుల్  అనే తేడా ఉండదు. ఎవరికైనా ఫైన్ వేస్తుంటారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా జరిగింది. ఈయన కార్ పై ఓవర్ స్పీడ్ చలాన్ ఉంది. కానీ అది ఎన్టీఆర్ పట్టించుకోలేదు.. నిజానికి ఆయన గుర్తుంచుకోలేదు కూడా. నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్‌లో పరిమితికి మించి కారు వేగంగా డ్రైవ్‌ చేసిన కారణంగా ఆయనకు 1,035 ఫైన్‌ వేశారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ఫైన్‌ను జూనియర్ చెల్లించలేదు.

ఈ విషయం ఎలా తెలుసుకున్నాడో తెలియదు కానీ ఒక అభిమాని మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చెల్లించాల్సిన ఫైన్‌ తాను స్వయంగా చెల్లించాడు. ఈ విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ చెల్లించాల్సిన మొత్తం ఈయన ఎందుకు పే చేశాడు అనేది చాలా మందికి అర్థం కాలేదు. ముందు అందరూ ఆయనపై అభిమానంతోనే  చెల్లించాడు అనుకున్నారు. పాపం ఆ అభిమాని కూడా కేవలం జూనియర్ ఎన్టీఆర్ అంటే ఉన్న ఇష్టంతోనే చలాన్ కట్టాడు.. కానీ అక్కడే చిన్న మెలిక కూడా పెట్టాడు. తాను చెల్లించిన మొత్తానికి రిటర్న్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టికెట్స్‌ కావాలని సదరు అభిమాని సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్ కు విన్నవించాడు. అది కూడా తనకు దగ్గరగా ఉండే మల్లికార్జున థియేటర్‌, భ్రమరాంబ థియేటర్స్‌లో టికెట్స్‌ ఇప్పించాలని కోరాడు. దీంతో ఆ అభిమాని పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదేమైనా అభిమానంలో ఇదోరకం. ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.
 

More Related Stories