English   

ప్రభాస్‌ను ఆ విషయంలో డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్..

prabhas
2020-03-31 20:40:32

హీరో ప్రభాస్ కు ఇప్పుడున్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికితోడు మొన్న ఈయన ప్రకటించిన 4.5 కోట్ల విరాళం చూసిన తర్వాత అంతా నిజంగానే ఈయన ఫ్యాన్స్ అయిపోయారు. సంపాదించింది కాస్తైనా దానం చేయాల్సిందే కదా అంటున్నాడు ఈయన కూడా. ఇక అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ప్రభాస్ ను ఓ విషయంలో ఫ్యాన్స్ బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు.. నువ్వు చేస్తావా చేయవా డార్లింగ్ అంటూ అడిగేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే డిమాండ్ చేస్తున్నారు కూడా. అందరి హీరోలు చేస్తున్నారు.. మొన్నటికి మొన్న చిరంజీవి కూడా చేసాడు.. నీకేమైంది డార్లింగ్ అంటున్నారు. ప్రభాస్ ను అంతగా ఇబ్బంది పెడుతున్నదెందుకో తెలుసా.. ట్విట్టర్ విషయంలో. ఇంత స్టార్ డమ్ ఉన్న హీరోవు కచ్చితంగా సోషల్ మీడియాలో కూడా ఉండాలి కదా అంటున్నారు అభిమానులు.

సినిమా విషయాలు తెలుసుకోడానికి కచ్చితంగా అకౌంట్ ఉండాల్సిందే అంటూ వాళ్లు పట్టుబడుతున్నారు. ప్రభాస్ ను కూడా వీలైనంత త్వరగా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నారు ఫ్యాన్స్. ఈ మధ్యే చిరంజీవి, రామ్ చరణ్ కూడా ట్విట్టర్ ఓపెన్ చేసారు. చరణ్ సైలెంట్ గానే ఉన్నాడు కానీ మెగాస్టార్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఈయన ధాటికి ట్విట్టర్ షేక్ అయిపోతుంది. అందుకే నువ్ కూడా ట్విట్టర్ ఓపెన్ చేయ్ డార్లింగ్ త్వరగా అంటూ ప్రభాస్ ను ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వాళ్ల విన్నపాన్ని ప్రభాస్ ఎంతవరకు పట్టించుకుంటాడో చూడాలిక.

More Related Stories