English   

రంగస్థలంపై అభిమానుల అలక

Rangasthalam-sukumar

రంగస్థలంపై అభిమానులు అలకబూనారా..? అంటే అవుననే వినిపిస్తోంది. అందుకు కారణం సుకుమార్ అని కూడా చెబుతున్నారాళ్లు. సుకుమార్ వల్ల రంగస్థలంకు సమస్యలు వస్తాయని వారు నమ్ముతున్నారు కూడా. ఎందుకో తెలుసా.. రంగస్థలం రన్ టైమ్ అలా ఉంది. యస్.. నిన్నటి వరకూ ఈ సినిమా రన్ టైమ్ 2గంటల 45నిమిషాలు అని వినిపించింది. కానీ రంగస్థలం మూడు గంటలకు పైనే ఉందని టాక్. అంత రన్ టైమ్ అంటే బోరింగ్ గా ఉంటుంది.. కాబట్టి తగ్గించాలని అభిమానులు పట్టుబడుతున్నారట. మామూలుగా రెండున్నర గంటలు దాటితేనే తెలుగు సినిమాలు బోర్ కొడతాయి(అర్జున్ రెడ్డిలాంటి సినిమాలు మినహాయింపు ఉంటుంది). అలాంటి ఓ స్టార్ హీరో సినిమా ఇంత సేపంటే భరించడం కష్టం అనుకుంటున్నారు వాళ్లు. అయితే వాళ్ల అనుమానానికి కూడా అర్థం ఉంది. ఎందుకంటే సుకుమార్ ఇలా లెంగ్తీగా తీసిన చాలా సినిమాలు దెబ్బకొట్టాయి. సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే చాలామందికి నచ్చకపోవడంలో రన్ టైమ్ దే కీలక పాత్ర. సినిమా అయిపోయినట్టే అనుకునే టైమ్ లోఇంకా ఇంకా సాగదీసి అప్పటి వరకూ బానే ఉందిలే అనుకున్నవారికి కూడా ఛా ఏంటిది అనుకునేలా చేశాడు. అలాగే ఆర్య-2. సో.. లెంగ్త్ ఎక్కువైతే సినిమాకు స్ట్రెంత్ తగ్గుతుందనేది వారి భయం. వారి భయంలోనూ నిజం ఉంది. కానీ సుకుమార్ ఇలాంటి మాటలు వినే రకం కాదు. అందుకని అభిమానుల అలక తీరుస్తాడు అనుకోలేం. మరి వీరిలో ఎవరు కరెక్ట్ అనేది ఈ నెల 30న తేలిపోతుంది. 

More Related Stories