English   

 తండ్రి, కొడుకు రెజీనా అందాల్నే నమ్ముకున్నారు..!!

Father and son trusted Rejina exposing
2018-06-30 20:15:28

అభినందన, ఘర్షణ, మౌనరాగం వంటి సినిమాలతో తెలుగువారినీ బాగా మెప్పించిన లేట్ 80స్ రొమాంటిక్ స్టార్ కార్తీక్. ఒకప్పుడు అతనికి ఓ రేంజ్ లో లేడీ ఫాలోయింగ్ ఉంది. అఫ్ కోర్స్ ఇప్పటికీ కార్తీక్ ను ఇష్టపడే వారున్నారు. హీరోగా తను రిటైర్ అయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారనని ఖచ్చితంగా నిర్ణయించుకున్న కార్తీక్ ను కొన్నాళ్ల క్రితం కళ్యాణ్ రామ్ ఒప్పించాడు. కళ్యాణ్ రామ్ తండ్రిగా మొదటిసారిగా హీరోయేతర పాత్ర చేసిన కార్తీక్ కు ఆ సినిమా కలిసి రాలేదు. ఇక మెల్లగా అప్పుడప్పుడూ అలాంటి పాత్రలు చేస్తోన్న కార్తీక్ తనయుడు గౌతమ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మణిరత్నం వంటి లెజెండ్ పరిచయం చేసినా గౌతమ్ కు పెద్దగా బ్రేక్ రాలేదు. ఇప్పటికీ తండ్రి ఫేమ్ తోనే కెరీర్ లాగిస్తున్నాడు. 

లేటెస్ట్ గా తండ్రి కొడుకు కలిసి ఓ సినిమాలో నటించాడు. సినిమా పేరు మిస్టర్ చంద్రమౌళి. అయితే ఇప్పుడు కార్తీక్ కు పెద్దగా మార్కెట్ లేదు. గౌతమ్ కు క్రేజ్ లేదు. అయినా ఇద్దరూ కలిసి నటిస్తోన్న సినిమాగా కాస్త అటెన్షన్ ఉంది. అయితే ఈ ఇద్దరూ ఉన్నా  వీళ్లు మాత్రం హీరోయిన్ రెజీనా అందాల్నే నమ్ముకున్నట్టు తెలుస్తోంది. యస్ ఈ సినిమాలో హీరోయిన్గా రెజీనా నటిస్తోంది. అమ్మడితో ఓ ఘాటైన సాంగ్ కూడా ఉంది. ఆ పాట చిత్రీకరించిన దగ్గర్నుంచీ ఈ పాట తాలూకూ పోస్టర్స్ తోనే సినిమాపై క్రేజ్ పెంచే ప్రయత్నం చేస్తోంది టీమ్. అటు కార్తీక్, గౌతమ్ ఉన్నా సరే.. జనాలు మాత్రం రెజీనా సోయగాల నుంచి కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. మరి ఆ పాటలో ఆ రేంజ్ లో అందాలారబోసిందీ ముద్దుగుమ్మ. చెప్పడానికి కూడా ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ అనే అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే బాగా మసాలా దట్టించినట్టు కనిపిస్తోంది. మొత్తంగా ఇప్పుడు తండ్రి కొడుకు కూడా రెజీనా అందాల్నే నమ్ముకోవడం మాత్రం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అంత క్రేజ్ ఉన్నా.. కార్తీక్ కూడా అలా రెజీనా పోస్టర్ ముందు తగ్గిపోవడం ఆశ్చర్యంగా ఉంది. మరి ఈ బ్యూటీ అందాలు ఈ మిస్టర్ చంద్రమౌళిని ఏ మేరకు ఆదుకుంటాయో చూడాలి. అన్నట్టు ఈ సినిమా జూలై 6న విడుదల కాబోతోంది. 

More Related Stories