English   

ఆసక్తికరంగా జ‌గ‌ప‌తిబాబు FCUK పోస్టర్ 

Jagapathi Babu
2020-12-30 16:19:30

జ‌గ‌ప‌తిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న కొత్త సినిమా FCUK. ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ అనేది ఫుల్‌ఫామ్. రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్ పాత్ర‌ల‌కు సంబంధించిన ఒక్కో పోస్ట‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. నాలుగు పాత్ర‌ల చుట్టూ తిరిగే క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా..ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు ఆస‌క్తినికి రేకెత్తిస్తున్నాయి.  జ‌గ‌ప‌తిబాబు (ఫాద‌ర్‌), బేబి స‌హ‌శ్రిత (చిట్టి), అమ్ము అభిరామి (ఉమా), కార్తీక్ (రామ్ కార్తీక్‌)లను ఒకే పోస్టర్‌లో చూపించారు. జ‌గ‌ప‌తిబాబు క్యాబేజీని చేతిలో పట్టుకొని, మ‌రో చేత్తో సెల్ ఫోన్ లోమాట్లాడుతున్నాడు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటుండ‌గా.. జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 
 

More Related Stories