English   

ఫిబ్రవరి ‘వెంకీ’స్..

venky atluri and venky kudumula
2018-03-03 10:11:28

ఏంటీ టైటిల్ కొత్తగా ఉందనుకుంటున్నారా.. ఎవరైనా కొత్తగా చూపిస్తే ఖచ్చితంగా కొత్తగనే పెట్టాలి కదా.. ఇంతకీ ఈ ఫిబ్రవరి వెంకీస్ అంటే ఏంటీ అనుకుంటున్నారా..? గత నెలలో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ మూవీస్ ఇచ్చిన కుర్రాళ్లెవరూ.. వెంకీస్.. ఒకరు వెంకీ కుడుముల, మరొకరు వెంకీ అట్లూరి. ఛలో, తొలిప్రేమ ఈ ఇద్దరి సినిమాలు. ఆ ఇద్దర్నే ఇప్పుడు టాలీవుడ్ లో ఫిబ్రవరి వెంకీస్ అంటున్నారు. అవును మరి.. ఫిబ్రవరి 2న ఛలో అంటూ హిలేరియస్ హిట్ కొట్టాడు వెంకీ కుడుముల.. ఫిబ్రవరి 10న తొలిప్రేమ అంటూ మెమరబుల్ హిట్ అందుకున్నాడు వెంకీ అట్లూరి. ఈ ఇద్దరు కుర్రాళ్లలో సారూప్యత పేర్లు మాత్రమే కాదు. ఇద్దరికీ ఇది ఫస్ట్ మూవీ. ఇద్దరివీ డిఫరెంట్ జానర్స్.. ఇద్దరూ హిట్లే కొట్టారు. అంతే కాదు.. ఆ వెంటనే ఇద్దరూ రెండు పెద్ద ప్రాజెక్ట్స్ పట్టుకున్నారు.

వెంకీ కుడుముల చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉన్నాడు. త్రివిక్రమ్ వద్ద అసిస్ట్ చేశాడు. అప్పుడే సితారా ఎంటర్టైన్మెంట్స్ లో చాన్స్ కూడా వచ్చింది. కానీ చేయలేదు. కారణం తన ఫ్రెండ్ నాగశౌర్య కెరీర్ లో హిట్టు చూడాలన్నదే కుర్రాడి లక్ష్యం. అది సాధించాడు. నాగశౌర్య కెరీర్ లోనే బెస్ట్ అండ్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఛలో వెంకీ స్ట్రెంత్ కామెడీ. ఎలాంటి వల్గారిటీ లేకుండా జెన్యూన్ గా గంటన్నరకు పైగా నవ్వించాడీ కుర్రాడు. అదే సినిమా విజయానికీ కీలకంగా మారింది. మినిమం బడ్జెట్ తో తెరకెక్కిన ఛలో కమర్షియల్ గా చూస్తే బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పాలి. అటు ఓవర్శీస్ లో కూడా ఛలో కు మంచి వసూళ్లు దక్కాయి. దీంతో తన ఫ్రెండ్ కు హిట్ ఇచ్చిన ఆనందం దక్కించుకోవడమే కాదు.. తనూ ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టానన్న గర్వంతో ఇప్పుడు మరో పెద్ద బ్యానర్ లో సినిమా పట్టేశాడు.

వెంకీ అట్లూరి కూడా అంతే. కేవలం తను రాసుకున్నదాన్నే నమ్మాడీ కుర్రాడు. మొదట్లో యాక్టింగ్ చేసినా.. ఫైనల్ గా యాక్టింగ్ చేయించడమే మజాగా ఫీలయ్యాడు. వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు ఈ వెంకీ. ఆ వెంకీ బలం కామెడీ అయితే ఈ వెంకీ బలం సెంటిమెంట్.. హృదయాల్ని బరువెక్కించగల సన్నివేశాలు అల్లుకోవడం ఈ కుర్రాడి బలం. వెరసి ఈ ఫిబ్రవరి టాలీవుడ్ కు మరో మంచి టాలెంట్ ను అందించింది. ఈ రెండు సినిమాలు కాకుండా ఇక ఫిబ్రవరిలో వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల్ని మినిమం ఎంటర్టైన్ చేయలేకపోయింది. సో.. ఆ ఫిబ్రవరి ఇప్పుడే కాదు.. ఎప్పటికీ వారి కెరీర్ లో వెంకీస్ ఫిబ్రవరి  గా నిలిచిపోతుందేమో.. 

More Related Stories