English   

పర్మిషన్ ఇచ్చినా థియేటర్లు ఓపెన్ అవ్వడం కష్టం 

 Film theatres
2021-06-21 13:13:20

తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ ఎత్తివేయడం తో పాటు సినిమా థియేటర్లు ను కూడా తెరుచుకోవచ్చు అని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతో సినిమా ప్రేమికులు రెండు నెలల తర్వాత  థియేటర్లు ఓపెన్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ సినిమా థియేటర్ యాజమాన్యాలు మాత్రం అంత ఆనందంగా లేవనే చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా థియేటర్లు చాలా సమస్యల్లో ఉన్నాయని ఆ సమస్యల పరిష్కారం అయ్యేవరకు థియేటర్లు ఓపెన్ చెయ్యక పోవచ్చునని తెలుస్తోంది. ఆ సమస్యలన్నింటిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి వివరించాలని సినీ పెద్దలు శనివారం రోజు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

ఇదివరకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేరక పోవడంతో పాటు ఇప్పుడు ఇచ్చే హామీలకు కూడా జీవోలు వచ్చిన తర్వాతే సినిమా థియేటర్ ల ఓపెన్ గురించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం థియేటర్ యాజమాన్యాలకు ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే... కరోనా ఫస్ట్ వేవ్ మరియు సెకండ్ వేవ్ కాలాలలో థియేటర్ లు  మూతపడడం జరిగింది. వీటికి సంబంధించిన కరెంట్ బిల్లు పూర్తిగా మాఫీ చేయడం మరియు టికెట్ ధరల పెంపునకు థియేటర్ యాజమాన్యం కే పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం. ఇలాంటి ప్రధాన సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడిన తర్వాత థియేటర్లు ఓపెన్ అవ్వడం జరుగుతుందని తెలుస్తోంది.

More Related Stories