English   

 మార‌ని బిచ్చ‌గాడు.. మ‌ళ్లీ అదే చేసాడు..!

Vijay-Antony
2018-05-16 12:38:38

ఇదివ‌ర‌కు బిచ్చ‌గాడు అంటే ఏంట్రా అలా అంటున్నావ్ అనేవాళ్లు కానీ ఇప్పుడు అలా కాదు. దానికి కూడా గౌర‌వం తీసుకొచ్చాడు విజ‌య్ ఆంటోనీ. రెండేళ్ల కింద ఈయ‌న న‌టించిన బిచ్చ‌గాడు సంచ‌ల‌నం విజ‌యం సాధించింది. అమ్మ సెంటిమెంట్ తో అంద‌ర్నీ క‌దిలించేసాడు విజ‌య్. ఆ త‌ర్వాత ఈయ‌న సినిమాల‌కు తెలుగులోనూ మంచి గుర్తింపు వ‌చ్చింది. అప్ప‌ట్నుంచీ వ‌ర‌స‌గా త‌న సినిమాల‌ను తెలుగులోకి తెస్తూనే ఉన్నాడు. కానీ బిచ్చ‌గాడు త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో హిట్ కొట్ట‌లేదు ఈ హీరో. అయితే త‌న సినిమాల‌కు డిఫెరెంట్ ప్ర‌మోష‌న్ ఫాలో అవుతున్నాడు ఈ హీరో. ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైన కాశీ సినిమా మొద‌టి 8 నిమిషాలు విడుద‌ల చేసాడు విజ‌య్. గ‌తంలో బేతాళుడు.. ఇంద్ర‌సేన సినిమాల‌కు కూడా ఇదే చేసాడు విజ‌య్ ఆంటోనీ. ఇదే సెంటిమెంట్ ఇప్పుడు కాశీకి కూడా ఫాలో అవుతున్నాడు. కృతుంగ ఉద‌య‌నిధి తెర‌కెక్కించిన ఈ చిత్రం మే 18న విడుద‌ల కానుంది. త‌మిళ్ లో కూడా అదే రోజు రానుంది. ఎలాగైనా తెలుగులో హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు విజ‌య్. మ‌రి ఈ చిత్రంతో ఆ కోరిక తీరుతుందో లేదో చూడాలి..!

More Related Stories