English   

రంభ కల ఫలించింది

First Time Actress Rambha Shared Her Baby Boy Photos
2018-11-07 22:44:38

రంభ.. తొంభైల్లో థండర్ థైస్ తో ఊపేసిన బ్యూటీ. అప్పట్లో టాఫ్ ఫోర్ హీరోలందరి సరసనా నటించి తనూ టాప్ ఫోర్ లో నిలిచిన హాటీ. యాక్టింగ్ మేటర్ ఏమో కానీ.. ఎక్స్ పోజింగ్ లో మాస్టర్ డిగ్రీ చేసిందీ రంభ. సెంటిమెంట్ సీన్స్ లో కూడా ఎక్స్ పోజింగ్ చేసిన ఏకైక హీరోయిన్ గా రంభకు ఓ రికార్డ్ ఉంది. అందుకే తను నాటి యువత కలల రాణి. ఏజ్ తో పనిలేకుండా ప్రతి ఒక్కరూ అభిమానించిన అందాల నాయకి. నాటీ బ్యూటీగా మంచి పేరున్న రంభ.. సినిమాలు తగ్గిన తర్వాత ఐటమ్ సాంగ్స్ లోనూ అదరగొట్టింది.

First Time Actress Rambha Shared Her Baby Boy Photos

పెళ్లయ్యాక రష్యాలో సెటిల్ అయిన రంభకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ ఆడపిల్లలే. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె భర్తతో విడిపోయిందని.. విడాకులకు అప్లై చేసిందనే న్యూస్ హల్చల్ చేశాయి. కానీ అవేవీ లేవని అప్పట్లోనే క్లారిటీ ఇచ్చిన ఈ జంట లేటెస్ట్ మరో బిడ్డకు పేరెంట్స్ అయ్యారు. ఇద్దరు ఆడపిల్లలకు తోడుగా రంభ మరో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. కుటుంబంతా కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మొత్తంగా మగపిల్లాడి కోసమే మూడవ సంతానం వరకూ వేచి ఉన్న రంభ కల ఫలిచింది.

First Time Actress Rambha Shared Her Baby Boy Photos

More Related Stories