English   

FMGE పరీక్షకు హాజరైన సాయి పల్లవి..

 Sai Pallavi
2020-09-03 14:29:30

సాయి పల్లవి కేవలం యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడా. ఇప్పటికే విదేశాల్లో ఎంబిబిఎస్ పూర్తిచేసుకుని ఇండియాకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక్కడ వైద్యం తో పాటు నటన కూడా కొనసాగిస్తుంది. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు తన వైద్య వృత్తిపై దృష్టి పెట్టింది. విదేశాల్లో ఎం బి బి ఎస్ పూర్తి చేసిన విద్యార్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో డాక్టర్‌గా రిజిస్టర్ చేసుకోవాలంటే నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ( FMGE) పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుచిలోని (MAM college)ఎంఏఎం కాలేజీలో జరిగిన పరీక్షకు హాజరైంది సాయి పల్లవి. 

ఓవైపు సినిమాలతో పాటు మరోవైపు వైద్యవృత్తిని కూడా కొనసాగిస్తానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో అవకాశాలు వచ్చినన్ని రోజులు చేస్తానని.. ఆ తర్వాత హాయిగా డాక్టర్ గా కొనసాగుతా అంటూ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చింది సాయి పల్లవి. ఇక కెరీర్ విషయానికి వస్తే తెలుగులో ప్రస్తుతం విరాట పర్వం, లవ్ స్టోరీ సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈ రెండు సినిమాల షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. విరాట పర్వం సినిమా లో నక్సలైట్ గా నటిస్తుంది సాయి పల్లవి. వేణు ఉడుగుల దీనికి దర్శకుడు. మరోవైపు శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నాగచైతన్యతో కలిసి నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మలయాళంలో కూడా బాగానే అవకాశాలు వస్తున్నా సొంత ఇండస్ట్రీ తమిళనాడులో మాత్రం సాయి పల్లవిని పట్టించుకోవడం లేదు.
 

More Related Stories