English   

ప్రభాస్ కోసం విదేశీ సెట్

foregin set for prabhas Saaho

ప్రభాస్.. ఈ పేరే ఓ సంచలనం ఇప్పుడు.  అందుకే అతనేం చేసినా ఆసక్తిగానే చూస్తున్నారు జనం. ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్ నెక్ట్స్ మరో ప్రాజెక్ట్ నూ ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉన్నాడు. ‘జిల్’ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లోఓ లవ్ స్టోరీ చేయడానికి ఓకే చెప్పి ఉన్నాడు.  ఇక సాహో కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే ఇది అందుకు పూర్తి భిన్నంగా.. మరోసారి ప్రభాస్ ను డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ రేంజ్ లో ప్రెజెంట్ చేసేలా ఈ స్క్రిప్ట్ ఉంటుందని ముందు నుంచీ వినిపిస్తోంది. 

బాహుబలి పూర్తి భిన్నమైన సినిమా.. ఇప్పుడు చేస్తున్నదీ ఇంచుమించు అలాంటి సినిమానే. అందుకే ఆ ట్రెండ్ లో కొట్టుకుపోకుండా ఉండేందుకే ప్రభాస్ ఇలాంటి రొమాంటిక్ సబ్జెక్ట్ కు ఓకే చెప్పాడు అంటున్నారు. హీరోయిన్ గా పూజా హెగ్డే కూడా ఫైనల్ అయిన ఈ మూవీ కూడా ప్రభాస్ సొంత బ్యానర్ లాంటి యూవీ క్రియేషన్స్ సంస్థే నిర్మించబోతోంది. 

త్వరలోనేఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లా ఇది కూడా విదేశీ బ్యాక్ డ్రాప్ లో సాగే కథట. మేజర్ షూటింగ్ పార్ట్ యూరప్ లో ప్లాన్ చేశారు. అయితే సాహో డేట్స్ తో క్లాష్ రాకుండా ఈ సినిమా కోసం ఏకంగా కొన్ని సీన్స్ కోసం విదేశీ లొకేషన్స్ ను తలపించేలా సెట్స్ వేస్తున్నారని టాక్. అంటే షూటింగ్ ఇక్కడే జరిగినా ఫీలింగ్ విదేశీ లొకేషన్ లా ఉంటుందన్నమాట. ఏదేమైనా ఇప్పుడు ప్రభాస్ మార్కెట్ రేంజ్ కు ఏం చేసినా నడుస్తుంది. ఒక రకంగా ట్రిక్ షాట్స్ కాకుండా విదేశీ సెట్ తో సినిమా అనడం ఇదే మొదటిసారేమో కదా.. 

More Related Stories