English   

గేమ్ ఓవర్ మూవీ రివ్యూ

Game over
2019-06-14 19:27:14

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఢిల్లీ బ్యూటీ తాప్సీ ఇక్కడ పదికి పైగా సినిమాల్లో నటించినా స్టార్ హీరోయిన్‌ హోదా దక్కించుకోలేక  విఫలమై బాలీవుడ్‌‌కి మారి తన దశ, దిశను మార్చుకుంది. పింక్, సూర్మా, ముల్క్, బేబీ, నామ్ షబానా, బద్లా వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. తాప్సీ పన్ను లీడ్‌లో నటించిన ‘గేమ్ ఓవర్’ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా 1200కు పైగా స్క్రీన్లలో తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలైంది. నయనతార ప్రధాన పాత్రలో తమిళ నాట ఘనవిజయం సాధించిన ‘మయూరి’ వంటి చిత్రాన్ని రూపొందించిన అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం. 

కధ : 

స్వప్న (తాప్సీ పన్ను) వీడియో గేమ్ డిజైనర్‌గా ఉంటూ గేమ్ ఓవర్ అనే వీడియో గేమ్‌కి అడిక్ట్ అవుతుంది. ఆమెకు డార్క్ ఫోబియో ఉంటుంది. చీకట్లో ఒక్క క్షణం కూడా రెండు క్షణాలు కూడా ఉండలేదు. పేరెంట్స్‌కి దూరంగా హైదరాబాద్‌లో ఒంటరిగా ఉండే స్వప్నకు కళ (వినోదిని) తోడుగా ఉంటుంది. వీడియో గేమ్స్‌కి బానిసగా మారిన స్వప్న తన చేతిపై ‘వీడియో గేమ్’ సింబల్‌ని టాటాగా వేయించుకుంటుంది. అయితే సంవత్సరం తరువాత స్వప్న చేతిపై ఉన్న టాటూ నుండి విపరీతమైన బాధ రావడంతో దానిని రిమూవ్ చేసుకోవడానికి వెళ్లగా అక్కడ ఆ టాటూ గురించి ఊహించని విషయాన్ని తెలుసుకుంటుంది స్వప్న.  ఇంతకీ ఆమె చేతి మీద ఉన్న టాటూ ఎవరిది? అందులో ఏం ఉంది? ఈ ‘గేమ్ ఓవర్’ ఆటలో గెలుపు ఎవరిది? అనేది వెండితెర మీద చూడాల్సిందే. 

విశ్లేషణ :

కొన్ని సినిమాలను అర్థం చేసుకోవ‌డం అంత ఈజీ కాదు, స్క్రీన్ ప్లే మాయో.. లేదంటే నిజంగానే కథ అలా ఉంటుందో అస్స‌లు అర్థం కాదు. గేమ్ ఓవ‌ర్ సినిమా కూడా అలాగే అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడి ఈ విషయాన్ని కొత్త‌గా చెప్ప‌డానికి ట్రై చేసాడు.. కాక‌పోతే ఆ కొత్త‌ద‌నం మ‌రీ ఎక్కువైపోయిందేమో అనిపించింది. మ‌రీ అర్థం కాని స్క్రీన్ ప్లేతో ప్రేక్ష‌కుల బుర్ర‌కు పెద్ద ప‌రీక్షే పెట్టాడు ద‌ర్శ‌కుడు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్. తొలి సినిమా మ‌యూరి మాదిరే ఇందులోనూ స్క్రీన్ ప్లే బేస్డ్ క‌థ రాసుకున్నాడు అశ్విన్. కాక‌పోతే అక్క‌డ ఉన్నంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే గేమ్ ఓవ‌ర్ సినిమాలో క‌నిపించ‌లేదు. ఫ‌స్టాఫ్ అస‌లు ఏ సీన్ ఎందుకొస్తుందో అర్థం కాలేదు.. సెకండాఫ్ మాత్రం ఆక‌ట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ బాగుంది.. అయితే క‌థ‌లో క్లారిటీ కంటే కన్ఫ్యూజ‌న్స్ ఎక్కువ‌గా ఉన్నాయి. తాప్సీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి.. ఆ సీరియ‌ల్ కిల్ల‌ర్స్ ఎందుకు చంపుతున్నారు. ఇలా చాలా ప్ర‌శ్నలే సినిమా చూసిన త‌ర్వాత మ‌న‌కు కూడా వ‌స్తాయి, కానీ స‌మాధానం దొర‌క‌దు. ఫ‌స్టాఫ్‌లో క‌థ ముందుకెళ్ల‌డానికి చాలా మొరాయించింది.. సెకండాఫ్ జ‌స్ట్ ఓకే. తాప్సీ మాత్రం త‌న పాత్ర‌లో అద్భుతంగా న‌టించింది.. ప‌నిమనిషిగా న‌టించిన వినోదిని పాత్ర ఆక‌ట్టుకుంది. మొత్తంగా అర్థ‌మ‌య్యేలా తీస్తే మంచి సినిమా.. అర్థం కాకుండా తీస్తే గొప్ప సినిమా. 

ఫైనల్ గా : గేమ్ ఓవ‌ర్ మాత్రం అంత ఈజీగా అర్థం కావ‌డం మాత్రం క‌ష్ట‌మే..

రేటింగ్ : 3 /5

More Related Stories