English   

హాట్ హాట్ గా త‌ల్లికూతుళ్లు..!

Gauri- Khan-Suhana
2018-07-19 12:11:24

తెలుగులో వార‌సురాళ్ల హ‌వా త‌క్కువ‌గా ఉంది కానీ బాలీవుడ్ లో మాత్రం వాళ్ల‌దే రాజ్యం. ఇక్కడ హీరోలు ఎలాగైతే కొత్త వాళ్ళు కాకుండా అంతా వార‌సుల‌తో నిండిపోయిందో అక్క‌డ హీరోయిన్లు కూడా అంతే. మ‌రొక‌రు ఛాన్సే లేకుండా అంతా వార‌సురాళ్లే దిగిపోతున్నారు. ఇప్ప‌టికే అక్క‌డున్న చాలా మంది హీరోయిన్లు కేరాఫ్ హీరోలు.. నిర్మాతల కూతుళ్లే. కరీనా క‌పూర్.. అలియాభ‌ట్.. శ్ర‌ద్ధాక‌పూర్.. సోనాక్షి.. తాజాగా శ్రీ‌దేవి కూతురు ఝాన్వి క‌పూర్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత అవుతుంది. ఈ మ‌ధ్య సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కూడా హీరోయిన్ అయిపోయింది. ఈ భామ ప్ర‌స్తుతం సినిమాల్లోకి వ‌చ్చేస్తుంది. ఇక ఇప్పుడు షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వంతు. ఈ ముద్దుగుమ్మ కూడా త‌న అందంతో చంపేస్తుంది. 

19 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఈ మ‌ధ్య ప్ర‌తీ వేడుక‌లో అందాల‌నే ఆయుధంగా వాడేస్తుంది. ఇప్పుడు సుహానా ఖాన్ అయితే ఏకంగా త‌న త‌ల్లి గౌరీఖాన్ తోనే క‌లిసి హాట్ పోజిచ్చింది. ప్ర‌స్తుతం ఈ త‌ల్లీకూతుళ్లు ఇద్ద‌రూ న్యూ యార్క్ లో ఉన్నారు. అక్క‌డే అదిరిపోయే రేంజ్ లో ఫోటోకు పోజిచ్చారు. తండ్రి షారుక్ సూప‌ర్ స్టార్ అయినా కూడా కూతురు గ్లామ‌ర్ షోకు మాత్రం అడ్డు చెప్ప‌ట్లేదు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో వాళ్లే ఆ ముద్దుగుమ్మ‌ల‌ను మ‌రింత అందంగా సిద్ధం చేస్తున్నారు. నేడో రేపో సుహానా కూడా హీరోయిన్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే షారుక్ త‌న‌యుడు హీరోగా వ‌స్తున్నాడ‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఇలాంటి టైమ్ లో కింగ్ ఖాన్ ముద్దుల త‌న‌య కూడా త‌న అందాల ఆర‌బోత‌లో పిచ్చెక్కిస్తుంది. మ‌రి ఈ భామ వెండితెరపై తొలి అడుగెప్పుడో..?   

More Related Stories