English   

చివరికి గౌతమ్ మీనన్ కూడానా...?

gautham-menon
2018-08-08 19:26:43

గౌతమ్ మీనన్.. ఈ పేరు వినగానే ఆయన రూపొందించిన ఎన్నో లవ్ స్టోరీస్ గుర్తొస్తాయి. అలాగే తన కెరీర్ లో మాగ్జిమం పోలీస్ కథల్నే డైరెక్ట్ చేసిన దర్శకుడుగానూ కనిపిస్తాడు. సౌత్ లో మోస్ట్ స్టైలిష్ మేకర్ అంటే గౌతమ్ తర్వాతే ఎవరైనా అని ఎవరైనా ఒప్పుకుంటారు. అతనికంటూ ఓ సెపరేట్ విజన్ ఉంటుంది. క్లారిటీ ఉంటుంది. అందుకే చాలామంది స్టార్స్ కూడా గౌతమ్ తో పనిచేయాలని కలలు కంటారు. ఒక్కసారి గౌతమ్ సినిమాలో హీరోగానో హీరోయిన్ గానో నటిస్తే అప్పటి వరకూ ఇమేజ్ ఖచ్చితంగా మారుతుంది. అంతేకాక తన సినిమాల్లో నటించే హీరోయిన్లను గౌతమ్ మీనన్ చూపించినంత అందంగా ఇంకెవరూ చూపించరు. అయితే లేటెస్ట్ గా అతనికి సంబంధించి ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గౌతమ్ మీనన్ హీరోగా మారుతున్నాడు.. ఏంటీ షాక్ అయ్యారా..? కానీ ఇది నిజం..
 
ఇన్నాళ్లూ దర్శకుడుగా తెర వెనక కథలు చెప్పిన గౌతమ్ మీనన్ ఫస్ట్ టైమ్ హీరోగా మారుతున్నాడు. అయితే ఎలా చూసినా హీరో మెటీరియల్ అనిపించుకునే ఫీచర్స్ ఉండవు గౌతమ్ లో. కానీ ఈ కథకోసం ఓ కొత్త దర్శకుడు గౌతమ్ ను హీరోగా నటించడానికి  ఒప్పించాడట. హరి అనే ఆ దర్శకుడు చెప్పిన కథ గౌతమ్ కు విపరీతంగా నచ్చిందట. కానీ హీరోగా చేయాలంటే చాలా ఆలోచించి.. ఫైనల్ గా కథ నచ్చడం వల్లే ఓకే చెప్పానని చెబుతున్నాడు. మరి ఈ కథలో హీరోయిన్ ఎవరు.. కథనం ఎలా ఉంటుంది. అసలు గౌతమ్ హీరోగా వస్తోన్న సినిమా ఎలా ఉండబోతోందని అనే వివరాలు త్వరలోనే తెలియజేస్తారట. 

ఇప్పటి వరకూ చాలామంది దర్శకులు హీరోలుగా నటించారు. కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ లోనే సక్సెస్ అయ్యారు. తెలుగులో దాసరి వంటివారు ప్రధాన పాత్రల్లో నటించినా హీరోలు అనలేం. ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన ఎస్వీ కృష్ణారెడ్డి కూడా హీరోగా చేయాలని తపించి ఫెయిల్ అయ్యాడు. తమిళ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. 

More Related Stories