English   

తెలుగు పాటపై తమిళ దర్శకుడి మోజు

Gautham-Menon
2018-08-11 17:07:05

కొన్ని పాటలకు భాషకంటే భావంతోనే ఎక్కువగా ఆకట్టుకుంటాయి. మరికొన్ని పాటలు  భాష అర్థం కాకపోయినా ట్యూన్స్ తో మెస్మరైజ్ చేస్తాయి. అలాంటి పాటలు మనకు చాలా ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా వచ్చిన గీత గోవిందం సినిమాలోని ఇంకేం ఇంకేం కావాలే పాట యూత్ పెదాలపై ఇప్పుడు అలవోకగా హమ్ అవుతోంది. ఈ పాటను చాలామంది కంటిన్యూస్ గా వింటున్నారు. అంటే పాట ట్యూన్ మాత్రమే కాదు.. లిరిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు సంగీతం అందించింది మళయాలీ అయిన గోపీ సుందర్. రాసింది అనంత్ శ్రీరామ్. మొత్తంగా ఈ సినిమాలో ఇదే హైలెట్ సాంగ్ గానూ కనిపిస్తోంది. అలాంటి పాటను తెలుగువాళ్లు విని ఆనందించడం వరకూ బానే ఉంది. కానీ ఈ సాంగ్ పై ఓ టాప్ తమిళ్ డైరెక్టర్ మోజు పడ్డాడు. మామూలుగా సాహిత్యాభిమాని అయిన ఆ దర్శకుడు ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ అనంత్  శ్రీరామ్ ను పొగడ్తల్లో ముంచేశాడు. 

ఇంతకీ ఆ దర్శకుడెవరో చెప్పలేదు కదూ.. మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ మీనన్. యస్.. గౌతమ్ మీనన్ కు ఈ పాట విపరీతంగా నచ్చిందట. అందుకే రోజంతా అదే పనిగా ఈ పాటను వింటున్నానని ట్వీట్ చేశాడు. అయితే విజయ్ దేవరకొండ ‘నోటా’ అనే సినిమాతో తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి.. ఒకరకంగా విజయ్ దేవరకొండను కూడా పొగిడినట్టే అనుకోవచ్చు. ఏదేమైనా ఓ తెలుగు పాటను మెచ్చుకుంటూ ఓ తమిళ దర్శకుడు ట్వీట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అనుకోవచ్చేమో.. 

More Related Stories