English   

గీత గోవిందం సెన్సార్ టాకేంటీ..?

Geetha-Govindam

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన సినిమా గీత గోవిందం. పరశురామ్ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీని బన్నీవాస్, గీతా ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించారు. టీజర్ తో ఆకట్టుకుని ట్రైలర్ తో హైప్స్ పెంచిన ఈ టీమ్ పూర్తి పాజిటివ్ వైబ్స్ తో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక ఈ నెల 15న విడుదల కాబోతోన్న గీత గోవిందం సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుంచి ఈ మూవీకి సర్టిఫికెట్ తో పాటు కొంత అప్లాజ్ కూడా వచ్చిందని చెబుతున్నారు. మరోవైపు సినిమాలో కీలకమైన ఓ పాయింట్ ఉంటుందట. అది ఆడియన్స్ కు కనెక్ట్ అయితే సినిమా హిట్ లేదంటే.. అంతే సంగతులు అనే టాక్ కూడా వినిపిస్తోంది. 

గీత గోవిందంకు సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. అంటే మరీ సాఫ్ట్ మూవీయేం కాదన్నమాట. అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ఓ కీచులాట నడుస్తుంటుంది. తను ప్రేమించిన అమ్మాయే తనను టార్చర్ చేస్తుంటుంది. అది భరిస్తూ ఆ హీరో ఆమెనే ప్రేమిస్తుంటాడు. అయితే ఈ టార్చర్ లెవెల్స్ కాస్త ఓవర్ డోస్ అయ్యాయనేది ఇన్ సైడ్ టాక్. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయినా.. అది ఎక్కువశాతం హీరోయిన్ డామినేషన్ తో సాగడం సినిమాకు మైనస్ అవుతుందంటున్నారు. ఒకవేళ ఆ పాయింట్ కనెక్ట్ అయితే అదే హైలెట్ అవుతుందని కూడా చెబుతున్నారు. సో.. హీరోయిన్ యాటిట్యూడ్ ఆడియన్స్ కు నచ్చితే గీత గోవిందం పాసైపోతారు.. లేదంటే.. అప్పుడే ఎందుకులెండి.. 

More Related Stories