గీతగోవిందం నిరూపించింది

కొన్ని సినిమాలు థియేటర్స్ లో రికార్డులు తిరగరాసినా కూడా ఎందుకో కానీ బుల్లితెరపైకి వచ్చేసరికి తోక ముడుస్తుంటాయి. ఖైదీ నెం.150, శాతకర్ణి లాంటి సినిమాలు అలాంటివే. కానీ కొన్ని సినిమాలు మాత్రం అక్కడా ఇక్కడా అన్నిచోట్లా అరాచకాలు చేస్తుంటాయి. ఇప్పుడు గీతగోవిందం ఇదే చేసి చూపించింది. ఈ చిత్రం గత వారం టీవీల్లో వచ్చింది. ఇప్పటి వరకు ఈ ఏడాది వచ్చిన టిఆర్పీ రేటింగ్స్ రికార్డులను దులిపేసింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 20 రేటింగ్ తీసుకొచ్చి ఔరా అనిపించింది. ఈ ఏడాది రంగస్థలం, మహానటి లాంటి సినిమాలు టీవీల్లోనూ రప్ఫాడించేసాయి. కానీ వాటి రేటింగ్ 20 అందుకోలేదు. భరత్ అనే నేను అయితే 14 దగ్గరే ఆగిపోయింది. కానీ ఇప్పుడు గీతగోవిందం మాత్రం ఏకంగా 20 దాటి రికార్డులను తిరగరాసింది.
విజయ్ దేవరకొండ క్రేజ్ కు తోడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే పేరు ఉండటంతో కుటుంబాలు కూడా టీవీల్లో గీతగోవిందం సినిమాకు ఫిదా అయిపోయారు. అర్జున్ రెడ్డితో తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేసిన విజయ్ దేవరకొండ.. గీతగోవిందంతో కుటుంబ ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. ఈ చిత్రం ఒకటా రెండా ఏకంగా 120 కోట్ల మార్క్ అందుకుంది. థియెట్రికల్ రన్ లో ఏకంగా 68 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. దూకుడు.. రేసుగుర్రంతో పాటు చాలా సినిమాలు క్రాస్ చేసింది ఈ సినిమా. యుఎస్.. కర్ణాటక.. తమిళనాడు.. కేరళ.. ఇలా ఏ ప్లేస్ చూసినా గీతగోవిందం రికార్డులు సృష్టించింది. చాలా సినిమాలు గీతగోవిందం దూకుడు ముందు తట్టుకోలేక చేతులెత్తేసాయి. ఇక విడుదలైన ఇన్ని రోజుల తర్వాత టీవీల్లోనూ ఈ చిత్రం దూకుడు కొనసాగింది. దాంతో ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు విజయ్ దేవరకొండ.