English   

ఆ హీరోయిన్ బరువు బాధ్యత నాదే - విజయ్ దేవరకొండ

Geetha-Govindam
2018-06-23 16:36:59

కాళ్లు తిమ్మిరి ఎక్కినా.. నడుము నొప్పి లేచినా మీ బరువు బాధ్యత నాదే మేడమ్.. అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇదంతా తన లేటెస్ట్ మూవీ ‘గీత గోవిందం’ ఫస్ట్ లుక్ సందర్భంగా రాసుకున్నాడు విజయ్.. గీత గోవిందం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. విజయ్ దేవరకొండ సరసన ఛలో ఫేమ్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.  చాలా రొమాంటిక్ గా ఉందీ లుక్. రెండు గోడలమధ్య ఖాళీ. అందులో విజయ్ దేవరకొండ కాళ్లను మరో గోడకు ఆన్చి కూర్చుంటే.. ఆ కాళ్లపై హీరోయిన్ రష్మిక మందన్నా కూర్చుంది. అందుకే తన కాళ్లు తిమ్మిరి ఎక్కినా.. నడుము నొప్పి లేచినా.. మీ బరువు, బాధ్యత నాదే మేడమ్ అంటూ రష్మికను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. రీసెంట్ గా ఈ ఇద్దరి ట్విట్టర్ రొమాన్స్ నడిచింది కదా.. దాన్ని గుర్తు చేస్తూ రష్మికను ఇలా మేడమ్ అని సంబోధించాడన్నమాట.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి పరశురాం దర్శకుడు. యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించిన పరశురాం ప్రతిభావంతమైన దర్శకుడు. అందుకే ఈ సినిమాపై మంచి హోప్స్ ఉన్నాయి. పైగా అన్నీ నచ్చితే కానీ నిర్మాణంలో దిగని అల్లు అరవింద్ ఈ సినిమాకు మరో ఎస్పెట్. చాలా రోజుల క్రితమే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీని త్వరలోనే విడుదల చేస్తాం అంటూ పోస్టర్ లో వేశారు. ఏదేమైనా ఈ ఫస్ట్ లుక్ మాత్రం సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. 

More Related Stories