English   

గీత‌గోవిందం.. గ‌ట్టిగా కొట్టేలా ఉన్నాడుగా..!

Geetha-Govindam
2018-07-11 18:36:06

అర్జున్ రెడ్డితో ఒక్క‌సారిగా అంద‌రికీ హాట్ ఫేవ‌రేట్ అయిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న సినిమాలు.. ఈయ‌న స్టైల్స్ అన్నీ యూత్ ఐకాన్ గా మారిపోయాడు. ప్ర‌స్తుతం విజ‌య్ సినిమాల‌పై బాగానే ఆరా తీస్తున్నారు కూడా. ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్న ఈ కుర్ర హీరో.. ఏది ముందొచ్చినా క‌చ్చితంగా హిట్ కొట్టాల‌న్న క‌సితో మాత్రం ఉన్నాడు. ఎందుకంటే కెరీర్ లో ఇలాంటి ఫేజ్ చాలా మంది హీరోల‌కు వ‌చ్చింది. కానీ ఆ త‌ర్వాత వాళ్లు స‌రిగ్గా డిజైన్ చేసుకోలేక చ‌తికిల‌ప‌డ్డారు. అంత‌మందిని చూసిన త‌ర్వాత తాను అలా కాకూడ‌ద‌ని జాగ్ర‌త్త ప‌డుతున్నాడు విజ‌య్. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టిస్తున్న గీత‌గోవిందంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. 

గీతాఆర్ట్స్ నిర్మాణం కావ‌డంతో సినిమాపై ఆస‌క్తి పెరిగిపోతుంది. పైగా శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు త‌ర్వాత ప‌రుశురామ్ చేస్తోన్న సినిమా.. ఛ‌లో బ్యూటీ ర‌ష్మిక హీరోయిన్.. ఇవ‌న్నీ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు విడుద‌లైన ఇంకేం కావాలి సాంగ్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ మ‌ధ్య రొటీన్ మ్యూజిక్ తో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న గోపీ.. గీతగోవిందంతో ఫామ్ లోకి వ‌చ్చేలా క‌నిపిస్తున్నాడు. ఇంకేం కావాలి పాట ఓ రేంజ్ లో విన‌బ‌డుతుంది ఇప్పుడు. అనంత శ్రీ‌రామ్ లిరిక్స్ కు తోడు సిధ్ శ్రీ‌రామ్ వాయిస్ కూడా ఈ పాట‌ను మ‌రో స్థాయికి తీసుకెళ్లిపోయింది. మొత్తానికి ఈ పాట‌తో గీత‌గోవిందం రేంజ్ మ‌రింత పెరిగిపోయింది. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది ఈ చిత్రం. 

More Related Stories