English   

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇంకేం కావాలి..?

Geetha Govindam Inkem Inkem Kaavali Trending Now
2018-08-22 10:58:18

ఒక్క పాట‌తో సినిమాపై అంచ‌నాలు పెరిగిపోతాయా..? ఒక్క‌పాట‌తో అంద‌రి దృష్టి ఆ సినిమాపై ప‌డుతుందా..? ప‌డుతుంది.. ఒప్పుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఇప్పుడు. ఆ మ‌ధ్య కృష్ణార్జున యుద్ధంలో దారిచూడు దుమ్ముచూడు.. ఛ‌లోలో చూసి చూడంగానే త‌ర‌హాలోనే ఇప్పుడు ఇంకేం కావాలి పాట యూ ట్యూబ్ ను షేక్ చేస్తుంది. గీతాగోవిందం సినిమాలోని ఈ పాట ఇప్పుడు వైర‌ల్ గా మారిపోయింది. అనంత శ్రీ‌రామ్ రాసిన ఈ పాట‌కు గోపీసుంద‌ర్ త‌న‌దైన శైలిలో ట్యూన్ ఇచ్చాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరో కావ‌డం.. ఛ‌లోతో కుర్రాళ్ల‌ మ‌తులు చెడ‌గొట్టిన క్యూట్ బేబీ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ కావ‌డంతో ఈ పాట మ‌రో స్థాయికి వెళ్లిపోయింది.

ఇప్పుడు ఏకంగా ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసింది ఇంకేం కావాలి పాట‌.. ప్ల‌స్ గీత గోవిందం ఆడియో. తాజాగా ఈ పాటకు 50 మిలియ‌న్ అంటే 5 కోట్ల వ్యూస్ తో పాటు 5 ల‌క్ష‌ల 25 వేల లైకులు కూడా వ‌చ్చాయి. దాంతో పాటు ఈ చిత్ర ఆడియోకు కూడా ఏకంగా 40 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. ద‌క్షిణాదిన ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డ్ ఇది. శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు త‌ర్వాత ప‌రుశురామ్ చేసిన ఈ సినిమా ఇప్పుడు సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఇప్ప‌టికే 40 కోట్ల క్ల‌బ్ లోకి చేరిన గీత‌గోవిందం.. ఇదే వారంలో 50 కోట్ల క్ల‌బ్ లోకి ఎంట‌ర్ అవ‌డం ఖాయం. మొత్తానికి ఈ పాట‌.. ఈ విజ‌యం ఇవ‌న్నీ చూసిన త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇంత‌కంటే ఇంకేం కావాలి చెప్పండి..?

More Related Stories