English   

దారుణం.. రిలీజ్ కు ముందే గీతాగోవిందం పైర‌సీ.. 

Geetha-Govindam-scenes-Leaked
2018-08-12 11:30:11

విడుదల త‌ర్వాత అంటే ఎలాగూ కాపాడుకోలేరు కాబ‌ట్టి పైరసీ బ‌య‌టికి వ‌చ్చినా ఇప్పుడు చేసేదేం ఉండ‌దు. విడుద‌ల రోజు మ‌ద్యాహ్నం నుంచే ఇష్ట‌మొచ్చిన‌ట్లు పైరసీ రాజ్య‌మేలుతుంది. కానీ ఇప్పుడు విడుద‌ల వ‌ర‌కు ఆగ‌డం లేదు క‌దా.. అస‌లే అస‌లు స‌మ‌స్య‌. గీతాగోవిందం సినిమాను విడుద‌ల‌కు ముందే లీక్ చేసారు. పైర‌సీ చేసి సీడీలు.. డివిడిల్లో అమ్మేస్తున్నారు. డైరెక్ట‌ర్స్ కాపీ లీక్ అయింది. ఆగ‌స్ట్ 15న రావాల్సిన ఈ చిత్రం ముందుగానే నెట్ లో ప్ర‌త్య‌క్షం అవ్వ‌డంతో షాక్ తిన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. వెంట‌నే సైబ‌ర్ టీంకు స‌మాచారం ఇచ్చి న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే గుంటూర్ లో ఇద్ద‌రు విద్యార్థుల మొబైల్స్ లో.. పెన్ డ్రైవ్స్ లో ఈ సినిమా దొర‌క‌డంతో టెన్షన్ పెరిగిపోతుంది. క‌నీసం రిలీజ్ వ‌ర‌కు అయినా ఆగుతారా లేదంటే ముందే సినిమా అంతా విడుద‌ల చేస్తారా అనే భ‌యం ద‌ర్శ‌క నిర్మాత‌ల్లోనూ క‌నిపిస్తుంది. విజ‌య్ దేవ‌ర కొండ‌, ర‌ష్మిక మంద‌న్న న‌టించిన ఈ చిత్రాన్ని ప‌రుశురామ్ తెర‌కెక్కించాడు. గీతాఆర్ట్స్ లో బ‌న్నీవాస్ గీత‌గోవిందాన్ని నిర్మించాడు. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. ఈ పైర‌సీ తంతును పోలీసులు ఎలా చేధిస్తారో..? 

More Related Stories