English   

 విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ 

Geetha-Govindam

కలిసొచ్చే కాలమొస్తే అంతే.. ఒక్కసారి లక్ చిక్కిందా ఇక దాన్ని ఎవరూ ఆపలేరు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఈ అదృష్టంతోనే ఇండస్ట్రీలో సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతున్నాడు. పెళ్లి చూపులుతో ఫేమ్అయినా అర్జున్ రెడ్డితో అతను ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. అభిమానులు పెరిగారు.. సంఘాలూ వెలిశాయి. ఇక ఈ అర్జున్ రెడ్డిని తన సినానియమ్ గా మారిపోయింది. అయితే ఇలాంటి సినిమాలకు ఓవర్శీస్ లో ఎలాంటి డిమాండ్ ఉంటుందో తెలిసిందే కదా. అందుకే విజయ్ కి ఓవర్శీలోనూ ఓ రేంజ్ లో అభిమానులు పెరిగారు. అదే ఇప్పుడు అతని కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ కు నాందిగా మారింది. 

విజయ్ సినిమాల్లో రిలీజ్ కు రెడీగా ఉన్న మూవీస్ లో గీత గోవిందం ఒకటి. గీతాఆర్ట్స్ బ్యానర్ లో పరశురామ్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ఇది. రష్మిక మందన్నా హీరోయిన్. ఈ ఇద్దరి మధ్య ట్విట్టర్లోనే అదిరిపోయే రొమాన్స్ నడుస్తోంది. ఇక సినిమాలో ఆ కెమిస్ట్రీ ఏ రేంజ్ లో వర్కవుట్ అయి ఉంటుందో వేరే చెప్పక్కర్లేదేమో. ఆగస్ట్ 14న విడుదల కాబోతోందీ గీత గోవిందం. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ కి ఇప్పుడు ఓవర్శీస్ లోనూ అదిరిపోయే మార్కెట్ వచ్చినట్టు ఈ సినిమా ప్రూవ్ చేయబోతోంది. యస్.. గీత గోవిందం ఓవర్శీస్ లో అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతోంది. విజయ్ చేసిన సినిమాల లెక్కతో పోలిస్తే ఇది ఖచ్చితంగా బిగ్గెస్ట్ రిలీజ్. అది పెరిగిన అతని రేంజ్ కు నిదర్శనంగా చెప్పొచ్చు.

ఇక ఓవర్శీస్ లో  గీత గోవిందం ను సరిగమా సినిమాస్ వారు రిలీజ్ చేయబోతున్నారు.  దర్శకుడుగా పరశురామ్ కు మంచి పేరుంది. అతని సినిమాల్లో హ్యూమన్ ఎమోషన్స్ అద్భుతంగా పండుతాయి. మంచి డైలాగ్స్ ఉంటాయి. అవన్నీ ఈ సినిమాలోనూ ఉంటే.. దానికి విజయ్ దేవరకొండ రేంజ్ మిక్స్ అయితే ఈ సినిమా రేంజ్ కూడా ఎక్కడికో వెళుతుందనేది నిజం. 

More Related Stories